Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం.. ఇక పర్యాటకం పరుగులే

Updated on: Oct 07, 2025 | 7:01 PM

ఏపీ పర్యాటకరంగం కొత్త పుంతలు తొక్కబోతుంది. ఎప్పటి నుంచో చెబుతున్న ‘కారవాన్‌’ వాహనం ఎట్టకేలకు విశాఖకు చేరింది. కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌, జాయింట్‌ కలెక్టర్‌ అశోక్‌ ఈ వాహనాన్ని పరిశీలించారు. సోమవారమే విధుల్లో చేరిన పర్యాటక శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ కల్యాణి కొత్త కారవాన్‌ విశేషాలను వారికి వివరించారు. విశాఖపట్నానికి చెందిన శివాజీ అనే వ్యాపారవేత్త రూ.1.4 కోట్లతో సమకూర్చుకున్న ఈ వాహనాన్ని.. ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకున్న తర్వాత విశాఖ నుంచి అరకులోయ, పాడేరు, లంబసింగి తదితర పర్యాటక ప్రాంతాలకు నడుపుతారు.

త్వరలో టూర్‌ ప్యాకేజీ వివరాలు ప్రకటిస్తారు. కారవాన్‌ రాకతో ఏపీలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కబోతుంది. సాంప్రదాయ పర్యాటకానికి కొత్త హంగులు జోడించి టూరిస్టులను ఫిదా చేసేందుకు కూటమి సర్కార్‌ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా కారవాన్లు కొనుగోలుచేసేవారికి ట్యాక్స్‌ మినహాయింపులతో పాటు కారవాన్‌ పార్కులకు ప్రోత్సహకాలు అందించనుంది.ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ లాంటి బస్సులను ఏర్పాటుచేసి టూరిస్ట్‌ డెస్టినేషన్లకు నడిపితే….డెవలప్‌మెంట్‌ హైవేపై ఏపీ టూరిజం రయ్‌రయ్‌మని దూసుకుపోవడం ఖాయమంటోంది సర్కార్‌. పాలసీలో బాగంగా కారవాన్లు కొనుగోలు చేసేవారికి ట్యాక్స్ మినహాయింపులు అందిస్తారు. ఇక కారవాన్ బస్సుల్లో ఉండే వసతులు చూస్తే కెవ్వు కేక అనాల్సిందే! కారవాన్‌ టూరిజానికి ఏపీ కేబినెట్‌ అలా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందో లేదో విశాఖలో కారవాన్‌ బస్సు సిద్ధంగా ఉంది. విశాఖకు చెందిన శివాజీ తన ముగ్గురు స్నేహితులతో కలిసి రూ. 1.4 కోట్ల వ్యయంతో సమకూర్చుకున్న ఈ వాహనాన్ని.. APTDCతో ఒప్పందం చేసుకొని పర్యాటకులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ కారవాన్‌లో లగ్జరీ సిటింగ్, బెడ్లు, ఫ్రిజ్‌, వాష్ రూమ్, ఓవెన్‌ సదుపాయాలు ఉన్నాయి. AC, వైఫై, టీవీ వంటి సౌకర్యాలు ఉంటాయి. ప్రత్యేకంగా పిల్లల కోసం ఒక బంకర్ బెడ్ ను ఏర్పాటు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కంత్రీ పాక్‌ కన్నింగ్‌ ప్లాన్‌.. మన చాబహర్‌ పోర్టు పక్కనే అమెరికా పోర్టు

Samantha: విద్యార్ధులకు సమంత కీలక సూచన.. చదువుతోపాటు వాటిపై కూడా దృష్టి పెట్టాలి

భార్య వెళ్లిపోయిందని చిన్నమ్మపై పగ.. 13 ఏళ్ల తర్వాత

దూసుకుపోతున్న బంగారం ధర తులం ఎంతంటే

హైదరాబాదీలు బీ అటెన్షన్ !! ఇది వింటే మీకు పండగే