Ayodhya Ram Mandir: అయోధ్య.. హిందుత్వ రాజధాని.. శతాబ్దాల కల సాకారమవుతోన్న వేళ టీవీ9 కాన్‌క్లేవ్‌.. లైవ్‌..

|

Jan 14, 2024 | 6:05 PM

Ayodhya Ram Mandir TV9 Conclave: అయోధ్య.. వైకుంఠనగరిగా .. విశ్వ ఆధ్మాత్మిక పురిగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భారతీయ సంస్కృతి , సాంప్రదాయం, అధ్యాత్మికత శోభిల్లే విధంగా అయోధ్య రామమందిరం రూపుదిద్దుకుంది. జనవరి 22న రామ్‌లల్లా విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవానికి.. రామభక్తలు తరంగాలై తరలి రావడానికి సిద్దమవుతున్నారు.

Ayodhya Ram Mandir TV9 Conclave: అయోధ్య.. వైకుంఠనగరిగా .. విశ్వ ఆధ్మాత్మిక పురిగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భారతీయ సంస్కృతి , సాంప్రదాయం, అధ్యాత్మికత శోభిల్లే విధంగా అయోధ్య రామమందిరం రూపుదిద్దుకుంది. జనవరి 22న రామ్‌లల్లా విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవానికి.. రామభక్తలు తరంగాలై తరలి రావడానికి సిద్దమవుతున్నారు. శతాబ్దాల కల సాకారమవుతోన్న వేళ… అన్ని దారులు ఇప్పుడు అయోధ్య వైపే పరుగులు తీస్తున్నాయి. జనవరి 22న అయోధ్యలో దివ్య, భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో టీవీ9 మండల దీక్షలా 40 రోజులుగా శ్రీరాముడిపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తోంది. శ్రీరామ సప్తాహంలో భాగంగా అయోధ్యలో ప్రాణప్రతిష్టకు ముందే రామాలయాన్ని ప్రేక్షకుల కళ్లముందు ఆవిష్కరింపచేసింది టీవీ9. స్టూడియో మొత్తం రామమయమైంది. అణువణువునా రాముడు నిండిపోయాడు. సీతారామలక్ష్మణ హనుమంతులు టీవీ9 స్టూడియోలో కొలువు తీరారు. తెలుగు మీడియా చరిత్రలో అపురూప ఘట్టంగా రామమందిర నమూనాను టీవీ9 ఆవిష్కరించింది. విశ్వహిందూ సమాజాన్ని ఏకం చేస్తున్న రాయాలయ ప్రారంభోత్సవ వేళ టీవీ9 కూడా రామభక్తిలో తన్మయత్వం పొందుతూ అయోధ్య హిందుత్వ రాజధాని పేరిట ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్తలతో కాంక్లేవ్‌ నిర్వహించింది. టీవీ9 కాన్‌క్లేవ్‌ లైవ్‌ వీడియోను వీక్షించండి..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..