Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వృద్ధాప్యాన్ని అడ్డుకునే విటమిన్‌ డి.. అధ్యయనాల్లో వెల్లడి

వృద్ధాప్యాన్ని అడ్డుకునే విటమిన్‌ డి.. అధ్యయనాల్లో వెల్లడి

Phani CH

|

Updated on: Jun 10, 2025 | 4:58 PM

విటమిన్‌ డి అనగానే ఎముకల పటుత్వం, రోగనిరోధక శక్తి బలోపేతం వంటివే గుర్తుకొస్తాయి. ఇది వృద్ధాప్యాన్ని కూడా అడ్డుకుంటుందని మీకు తెలుసా? అవును తాజా అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడయింది. విటమిన్‌-D శారీరక వయసు త్వరగా మీద పడకుండా చూడటానికీ తోడ్పడు తున్నట్టు మాస్‌ జనరల్‌ బ్రిగమ్, మెడికల్‌ కాలేజ్‌ ఆఫ్‌ జార్జియా తాజా అధ్యయనంలో తేలింది.

మన క్రోమోజోముల చివర టోపీల మాదిరిగా టెలమిర్‌ అనే రక్షణ కవచాలుంటాయి. ఇవి క్రోమోజోమ్‌ చివర్లు క్షీణించకుండా, ఇతర క్రోమోజోములతో కలిసి పోకుండా కాపాడతాయి. అయితే, వయసు మీద పడుతున్నకొద్దీ టెలమిర్ల సైజు తగ్గుతూ వస్తుంటుంది. ఇవి మరీ పొట్టిగా అయితే శారీరక వయో ప్రక్రియలు ప్రేరేపితమవుతాయి. కణ విభజన నిలిచిపోవటానికి, వయసుతో ముడిపడిన జబ్బులకు కారణమవుతాయి. ఇక్కడే విటమిన్‌ డి రక్షణగా నిలుస్తోంది. దీన్ని మాత్రల రూపంలో తీసుకుంటే టెలమిర్లు పొట్టిగా అవకుండా కాపాడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో 55 ఏళ్లు పైబడిన మహిళలు, 50 ఏళ్లు పైబడిన పురుషులను ఎంచుకొని.. కొందరికి విటమిన్‌ డి3, మరికొందరికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లం పరిమిత పరిమాణంలో తీసుకోవాలని సూచించారు. నాలుగేళ్ల తర్వాత పరిశీలించగా.. విటమిన్‌ డి తీసుకున్నవారిలో టెలమిర్లు పొట్టిగా అయ్యే ప్రక్రియ గణనీయంగా మందగించినట్టు తేలింది. అయితే ఒమేగా 3 కొవ్వు ఆమ్లం పెద్దగా ప్రభావమేమీ చూపలేదు. శారీరక వయో ప్రక్రియ నెమ్మదించటానికి విటమిన్‌ డి మాత్రలు తోడ్పడుతున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నప్పటికీ దీనిపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరముందని పరిశోధకులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: గూస్ బంప్స్‌ కాదు.. పిచ్చెక్కిస్తోన్న.. అఖండ2 యాక్షన్

బాబుది సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. కొనాలంటే మన నెల జీతం కూడా సరిపోదు

నేను చేసిన ఎదవ పనికి.. పాపం.. NTR గుక్కపెట్టి ఏడ్చాడు!

ఒకప్పుడు వైజాగ్‌లో అరటి పండ్లు అమ్మాడు.. ఇప్పుడు 400 కోట్ల సినిమాతో సంచలనం

సమస్యే లేదు.. ఆమె లేనిది సినిమానే లేదు