Electric Vehicles: భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కారణమిదే..!

|

Mar 22, 2024 | 12:41 PM

పర్యావరణ పరిరక్షణ, పెట్రోలు వాడకం తగ్గించడం, సహజ వనరుల రక్షణ కోసం ఈ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆ వాహనాలను కోనుగోలు చేసిన వారికి సబ్సిడీ అందజేస్తుంది. ఇందుకోసం బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయింపులు చేపట్టింది. 

పర్యావరణ పరిరక్షణ, పెట్రోలు వాడకం తగ్గించడం, సహజ వనరుల రక్షణ కోసం ఈ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆ వాహనాలను కోనుగోలు చేసిన వారికి సబ్సిడీ అందజేస్తుంది. ఇందుకోసం బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయింపులు చేపట్టింది. ఆధునిక ఫీచర్లు, అందమైన లుక్ తో ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కోనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉండగా, త్వరలో ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు పెరిగనున్నాయి. కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా వివిధ కంపెనీలు అనేక ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. కొనుగోలుదారులకు వివిధ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. నెలవారీ వాయిదాల పద్ధతిలో కూడా అందజేస్తున్నాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 70 నుంచి వంద కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్న ఈ వాహనాలకు మార్కెట్లో డిమాండ్ కూడా భారీగా ఉంది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం..

Published on: Mar 22, 2024 12:31 PM