West Asia War: యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం

Updated on: Mar 02, 2026 | 11:31 AM

పశ్చిమ ఆసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు భారత్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌పై దాడులు, ప్రతీకార చర్యలతో గల్ఫ్‌లో అనిశ్చితి నెలకొంది. దీనివల్ల బాస్మతి బియ్యం, తేయాకు ఎగుమతులు నిలిచిపోయాయి, ముఖ్యంగా ఇరాన్‌కు. హోర్ముజ్ జలసంధి మూసివేత భయంతో చమురు దిగుమతులు, ఇంధన ధరల పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలు.

పశ్చిమ ఆసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారత ఎగుమతులను దెబ్బతీసాయి. పెట్రోల్‌ డీజిల్‌ రేట్లు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేసి ఇరాన్‌ నేత ఖమేనీని హతమార్చాయి. దాంతో ఇరాన్‌ ప్రతీకారంతో రగిలిపోతోంది. గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. గల్ఫ్‌ దేశాలకు భారత్‌ విమానాల రాకపోకలను నిలిపివేసింది. పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం భారత్‌లో రెండు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకటి చమురు. రెండోది రైతులకు ఆదాయం తెచ్చిపెట్టే బాస్మతి బియ్యం. బియ్యంతో టీ ఎగుమతులపై కూడా ప్రభావం పడనుంది. 2024-25లో భారత్ దాదాపు రూ. 700 కోట్ల విలువైన తేయాకును ఇరాన్‌కు ఎగుమతి చేసింది. ప్రస్తుత అనిశ్చితి వల్ల ఈ చెల్లింపులు ఆగిపోయే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం 40 దేశాలపై ఆధారపడుతున్నప్పటికీ 50% దిగుమతులు పశ్చిమ ఆసియా నుంచే వస్తున్నాయి. ముఖ్యంగా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ నుంచి వచ్చే చమురు ‘హోర్ముజ్ జలసంధి’ గుండానే రావాలి. ప్రపంచ చమురు సరఫరాలోనూ 25% ఈ మార్గం నుంచే జరుగుతుంది. యుద్ధం కారణంగా ఈ జలసంధి మూతపడితే భారత్‌కు రోజుకు వచ్చే 25-27 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోతుంది. అమెరికా, లాటిన్ అమెరికా నుంచి చమురు తెప్పించుకోవాలంటే 25 నుంచి 45 రోజులు పడుతుంది. అదే గల్ఫ్ నుంచి అయితే కేవలం 5-7 రోజుల్లో చమురు వస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి దేశంలో ఇంధన ధరలు భగ్గుమనే అవకాశం ఉంది. భారతదేశం నుంచి ఎగుమతయ్యే బాస్మతి బియ్యానికి ఇరాన్ అతిపెద్ద కొనుగోలుదారు. యుద్ధం ప్రారంభం కావడానికి రెండు నెలల ముందే ఇరాన్ వ్యాపారులు భారీగా ఆర్డర్లు ఇచ్చారు. దీంతో భారత మార్కెట్లో బాస్మతి బియ్యం ధర కిలోకు రూ.10 పెరిగింది. అయితే, ఇప్పుడు యుద్ధం కారణంగా ఈ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. భారత్ ఎగుమతి చేసే మొత్తం బాస్మతి రైస్ లో 25% ఇరాన్‌కు, 20% ఇరాక్‌కు వెళ్తాయి. సుమారు $2 బిలియన్ల (రూ. 16,000 కోట్లకు పైగా) విలువైన 20 లక్షల టన్నుల బియ్యం వ్యాపారం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ప్రస్తుతం సముద్ర మార్గంలో ఉన్న షిప్‌మెంట్ల డెలివరీ తీసుకోవడానికి ఇరాన్ వ్యాపారులు వస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి పశ్చిమ ఆసియాలో యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే భారత ఆర్థిక వ్యవస్థకు అంత మేలు జరుగుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

March 2026 Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే

Gold Price: యుద్ధం దెబ్బకు.. భారీగా బంగారం, వెండి ధరలు

US-Israel Strikes On Iran: ఇరాన్ పై B2 బాంబులను వదిలిన అమెరికా

Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??

Kodali Nani: రెడ్‌ బుక్‌లో జగన్ పేరు ఉంటే లోకేష్‌కే ఇబ్బంది..

Loading...
Unable to load recommendations.
Follow Us