బ్యాంకు కస్టమర్స్‌కు అలర్ట్.. ఆ నెంబర్ సిరీస్ నుంచి కాల్ వస్తేనే సేఫ్

Updated on: Nov 22, 2025 | 12:58 PM

ట్రాయ్ కీలక నిర్ణయంతో ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట పడనుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇకపై కస్టమర్లకు కాల్ చేసేందుకు తప్పనిసరిగా 1600 సిరీస్ నంబర్‌లను వాడాలి. నకిలీ, మోసపూరిత కాల్స్‌ను గుర్తించి, ఖాతాదారులు సురక్షితంగా ఉండేలా ఈ చర్య దోహదపడుతుంది. జనవరి 1, 2025 నుండి ఇది అమలులోకి వస్తుంది, వివిధ సంస్థలకు వేర్వేరు గడువులున్నాయి.

అనవసరమైన కాల్స్‌ వేధిస్తున్నాయా? పలానా బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నాం అంటూ బురిడీ కొట్టిస్తున్నారా? ఏది బ్యాంక్‌ కాలో ఏది నకిలీ కాలో తేల్చుకోలేకపోతున్నారా? ఇక నుంచి అలాంటి భయానికి చెక్‌ పెట్టబోతుంది ట్రాయ్‌. మోసపూరిత ఫోన్‌ కాల్స్‌ ద్వారా జరిగే ఆర్థిక నేరాల కట్టడికి ట్రాయ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ, సెబీ, పీఫ్‌ఆర్‌డీఏ వంటి నియంత్రణ సంస్థల పరిధిలోని బ్యాంకులు, ఆర్థిక సేవలు, బీమా కంపెనీలు తమ కస్టమర్లకు చేసే సర్వీస్‌, లావాదేవీల ఫోన్‌ కాల్స్‌ కోసం తప్పనిసరిగా 1600 నంబర్‌ సిరీస్‌ ఫోన్‌ నంబర్లు మాత్రమే వాడాలని ఆదేశించింది. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకులు ఈ నిబంధనలను వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచే అమలు చేయాలని ట్రాయ్‌ ఆదేశించింది. వాయిస్‌ కాల్స్‌ ద్వారా జరిగే ఆర్థిక మోసాలను కట్టడి చేసేందుకు ట్రాయ్‌ ఈ చర్య తీసుకుంది. దీంతో ఏది మోసపూరిత కాల్‌, ఏది నిజమైన కాల్‌ అని తెలుకునే అవకాశం ఈ సంస్థల ఖాతాదారులకు ఏర్పడనుంది. కాగా ఐఆర్‌డీఏతో జరుగుతున్న చర్చలు పూర్తయ్యాక బీమా కంపెనీలకూ ఈ సీరీస్‌ వర్తిస్తుందని ట్రాయ్‌ తెలిపింది. ట్రాయ్‌ ఆదేశాల ప్రకారం మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 1600 సిరీస్‌ ఫోన్‌ నంబర్లు అమలు చేయాల్సి ఉంటుంది. క్వాలిఫైడ్‌ స్టాక్‌ బ్రోకర్లకు మార్చి 15, 2026 నుంచి.. ఆర్‌బీఐ నియంత్రణలోకి వచ్చే పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలు, పేమెంట్‌ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు లు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 లోగా 1600 సిరీస్‌ ఫోన్‌ నంబర్లు అమలు చేయాల్సి ఉంటుంది. ఇతర ఎన్‌బీఎఫ్‌సీలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇతర చిన్న సంస్థలు 2026 మార్చి 1 నుంచి.. కేంద్రీయ రికార్డ్‌ కీపింగ్‌ ఏజెన్సీలు, పెన్షన్‌ ఫండ్‌ మేనేజర్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15లోగా ట్రాయ్‌ ఆదేశాలు అమలు చేయాల్సి ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టక్కులు, టైలతో వచ్చి.. ఆర్‌బీఐ అంటూ బిల్డప్ ఇచ్చి .. రూ.7.11 కోట్లు దోచేసిన గ్యాంగ్

కుమార్తె వివాహం చేయలేకపోతున్నా.. మనస్తాపంతో తండ్రి తీవ్ర నిర్ణయం

నటి ప్రత్యూష కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

Samantha: సమంత పై రాజ్ నిడిమోరు కామెంట్స్‌

కోచింగ్‌ సెంటర్‌లో పరిచయం.. ఐబొమ్మ రవి లవ్‌ స్టోరీ