మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంతంటే ??
Gold Price

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంతంటే ??

Updated on: Oct 29, 2025 | 4:53 PM

కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టడంతో గోల్డ్‌ ప్రియులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇంతలోనే మళ్లీ బంగారం ధర పెరగడం మొదలు పెట్టింది. అక్టోబరు 29 బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.760 పెరిగింది. వెండి కిలోపై రూ.1000 పెరిగింది.

కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టడంతో గోల్డ్‌ ప్రియులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇంతలోనే మళ్లీ బంగారం ధర పెరగడం మొదలు పెట్టింది. అక్టోబరు 29 బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.760 పెరిగింది. వెండి కిలోపై రూ.1000 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,580 గా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో బుధవారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,730 ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,600 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,580, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,500 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,290, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,12,100 గా కొనసాగుతోంది.కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,22,460, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,14,500 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,21,580, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,500 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,66,000 గా ఉంది. ఈ ధరలు ఉదయం 11 గంటలకు నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. కనుక బంగారం కొనేందుకు వెళ్లే ముందు మరోసారి ధరలు చెక్‌ చేసుకుంటే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు నుండి జారిపడిన యువకుడు.. క్షణంలో..

వామ్మో.. ఈ దున్నపోతు ధర రూ.23 కోట్లట !! ఈ గుర్రం ధర రూ.15 కోట్లట

Kurnool bus tragedy: కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్

లివ్ ఇన్ పార్ట్‌నర్‌ను చంపి.. నెయ్యి, వైన్ పోసి తగులబెట్టింది

క్యాన్సర్ రోగుల కోసం కదిలిన ఒడిశా కేశదాత హరప్రియ