Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు

Updated on: Dec 19, 2025 | 6:30 PM

శుక్రవారం, డిసెంబరు 19న బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రూ.660, 22 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గింది. కేజీ వెండి ధర రూ.2000 తగ్గగా, హైదరాబాద్‌లో వెండి రూ.3000 పడిపోయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లోని తాజా ధరల వివరాలను తెలుసుకోండి. బంగారం కొనేముందు ధరలు మళ్ళీ సరిచూసుకోండి.

శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. డిసెంబరు 19 శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.660 తగ్గి, రూ.1,34,180 కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600 తగ్గి రూ.1,23,000 పలుకుతోంది. కేజీ వెండిపై రూ.2000 తగ్గి రూ.2,09,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,34,330 , పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,150 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,180 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,23,000 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,060, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,800 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,180 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,000 లు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,34,180 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,23,000 పలుకుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ.3000 తగ్గి రూ. 2,21,000 పలుకుతోంది. ఈ ధరలు మధ్యాహ్నం 12 గంటలకు నమోదైనవి. ఇవి తరువాత పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌ చేసుకోవాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: బాబోయ్ చలి.. గడపదాటాలంటే వణుకే

IBomma Rav: ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

Balakrishna: బాలయ్య నిర్ణయంతోనే .. ఆ రోజు ఓజీ రిలీజ్

నేను మనిషినేగా.. తాను పడిన బాధను గుర్తు చేసుకుంటూ.. బోయపాటి ఎమోషనల్

Rithu Chowdary: డిమాన్‌ కోసం బయట కష్టపడుతున్న రీతూ చౌదరి!