Gold Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. త్వరలో మరింత తగ్గే అవకాశం.
గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్. కొద్దిరోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న ధర గురువారం భారీగా తగ్గింది. తులం బంగారంపై 600 రూపాయల వరకూ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ తగ్గడం, డాలర్ విలువ పుంజుకోవడంతో పసిడి ధరలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ మార్కెట్ల్ 22 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర 600 తగ్గి 53,900 రూపాయలు పలుకుతోంది. 24 కేరట్ల మేలిమి బంగారం ధర 650 రూపాయలు తగ్గి 58,800కు చేరుకుంది.
గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్. కొద్దిరోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న ధర గురువారం భారీగా తగ్గింది. తులం బంగారంపై 600 రూపాయల వరకూ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ తగ్గడం, డాలర్ విలువ పుంజుకోవడంతో పసిడి ధరలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ మార్కెట్ల్ 22 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర 600 తగ్గి 53,900 రూపాయలు పలుకుతోంది. 24 కేరట్ల మేలిమి బంగారం ధర 650 రూపాయలు తగ్గి 58,800కు చేరుకుంది. బంగారం బాటలోనే వెండికూడా నడుస్తోంది. వెండి ధరలు కూడా బాగా తగ్గాయి. కేజీ వెండిపై 500 రూపాయలు తగ్గి 77 వేల రూపాయలనుంచి 76,500 రూపాయలకు చేరింది. నెలల వ్యవధిలో బంగారం రేట్లు కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు మరింత పెంచే యోచనలో ఉండడంతో మదుపర్లు బంగారానికి బదులు షేర్లపై మొగ్గుచూపుతున్నారు. త్వరలో పసిడి, వెండి ధరలు మరింత తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన దేశంలో పెళ్లిళ్ల సీజన్, పండగలు ముగియడంతో ప్రజలు కొనుగోళ్లకు ఆసక్తి చూడపడం లేదు. దసరా, దీపావళి సీజన్ వరకు వేచి చూస్తారని, అప్పుడు కొనుగోళ్లు పుంజుకునే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..