రైలు టికెట్‌ లేని వారి నుంచి ఒక్క రోజే రూ.కోటి వసూలు

Updated on: Oct 17, 2025 | 5:52 PM

టికెట్​ లేని ప్రయాణికుల నుంచి జరిమానాగా రైల్వే శాఖ.. సోమవారం ఒక్కరోజే కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది. దీపావళి, ఛట్‌ పండుగల సీజన్ తో అన్ని రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్ ​ పరిధిలోని స్టేషన్లలో అధికారులు తనిఖీలు తీవ్రం చేశారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, గుంతకల్‌, గుంటూరు, నాందేడ్‌ డివిజన్లలో డ్రైవ్‌ చేపట్టారు.

దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే ఆదేశాలతో సోమవారమంతా తనిఖీలు నిర్వహించారు. టికెట్ లేకుండా జర్నీ చేస్తున్న ప్రయాణికులను గుర్తించి జరిమానా వసూలు చేశారు. మొత్తం 1.08 కోట్ల రూపాయల ఆదాయం ఫైన్ రూపంలో లభించిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, టికెట్ లేకుండా ప్రయాణించిన వారిపై మొత్తం 16,105 కేసులు నమోదు చేశారు. సాధారణంగా జోన్‌‌ పరిధిలో రోజువారీ టికెట్ తనిఖీల్లో దాదాపు 9,500 కేసుల నమోదుతో సుమారు రూ.47 లక్షల ఆదాయం వస్తుంది. కానీ, దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఒకే రోజు టికెట్ తనిఖీలతో ఆదాయం రూ. కోటి దాటడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ అభినందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనా పైసల కోసం గాడిదలు పెంచుతున్న పాక్

నీతా అంబానీ బ్యాగ్‌ ఖరీదెంతో తెలుసా ??

ఈ బుగ్గ గిల్లడాన్ని ఏమంటారో మరి

చూసే వాళ్ళం పిచ్చోళ్ళమా బిగ్ బాస్! సంజన – మాధురి తీరుపై జనం ఆగ్రహం

మాట తప్పిన మాధురి.. సార్ మాట కాదని వెస్ట్రన్ బట్టల్లో