రూ.10 వేల పెట్టుబడి పెట్టండి.. రూ.7 లక్షలు పొందండి

Updated on: Jul 22, 2025 | 5:23 PM

చిన్న మొత్తాల పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికోసం పోస్ట్ ఆఫీస్ అనేక పథకాలను మన ముందుకు తీసుకు వచ్చింది. తమ వద్ద పెట్టే పెట్టుబడికి..షేర్లు, మ్యూచువల్ ఫండ్లలో ఉన్న రిస్క్ ఉండదని తపాలా శాఖ చెబుతోంది. తమ వద్ద పెట్టే పెట్టుబడికి కేంద్రం హామీ ఉంటుంది గనుక ఎలాంటి భయం అవసరం లేదని భరోసా ఇస్తోంది.

నిజానికి పోస్ట్ ఆఫీస్ అనేక పొదుపు పథకాలను అందిస్తున్నా.. వాటిలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం బాగా పాపులర్ అయింది. ఇది బ్యాంకులు అందించే రికరింగ్ డిపాజిట్ వంటిది. ఇక.. ఈ ఫథకం ఫీచర్స్ చూస్తే.. ఈ పథకం కాలపరిమితి 60 నెలలు. ప్రతినెలా మన శక్తిని బట్టి ఒక మొత్తాన్ని కడుతూ వెళ్ళాలి. ఈ పథకంలో చేసే పొదుపు మీద ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ వస్తోంది. ప్రతి 3 నెలలకూ ప్రభుత్వం ఈ వడ్డీ రేటులో మార్పులు చేస్తోంది. ఈ పథకంలో నెలకు కనీసం రూ.100 పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడికి ఎటువంటి పరిమితి లేదు. ఒకవేళ.. మీరు నెలకు రూ. 10 వేలు కడితే.. 5 సంవత్సరాల తర్వాత మీకు రూ.7,13,659 రాబడి లభిస్తుంది. అంటే..60 నెలల పాటు మీరు 10 వేలు చొప్పున కడితే.. ఐదేళ్లకి మీరు కట్టే మొత్తం రూ. 6 లక్షలు అవుతుంది. ఐదు సంవత్సరాలలో రూ. 1,13,659 రూపంలో జమ అవుతుందన్న మాట. ఒకవేళ.. మీరు నెలకు రూ. 20,000 చొప్పున ఈ పథకంలో పెట్టుబడి పెడితే, మీ పెట్టుబడి విలువ ఐదు సంవత్సరాలలో రూ. 14,27,315 అవుతుంది. ఈ పథకంలో ఐదేళ్ల పాటు డబ్బు కట్టిన తర్వాత.. దానిని మరో ఐదేళ్ల పాటు పొడిగించుకోవాలని అనుకుంటే.. నెలకు రూ. 10 వేలు చొప్పున కట్టిన వారికి పదేళ్ల తర్వాత.. రూ. 17 లక్షలు అందుతాయి. అదే.. నెలకు రూ. 20 వేలు పెట్టుబడి పెట్టిన వారికి పదేళ్ల తర్వాత రూ.34 లక్షలు అందుతాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ట్రాప్‌లో మీరూ పడ్డారా ?? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

తల్లిదండ్రులకు బిగ్ అప్డేట్.. వెంటనే అలా చేయకపోతే మీ పిల్లల ఆధార్ రద్దు!

నిర్మల్‌ జిల్లాలో కోడిగుడ్డు బాబా.. ఒకే ఒక్క గుడ్డుతో రోగాలన్నీ మాయం

పొట్ట తగ్గాలా ?? అయితే ఈ పండ్లు తినండి చాలు

చైనా రైల్వే స్టేషన్లలో.. సరకులు మోస్తున్న రోబోలు