AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాన్‌కార్డ్‌ హోల్డర్స్‌కి కేంద్రం హెచ్చరిక

పాన్‌కార్డ్‌ హోల్డర్స్‌కి కేంద్రం హెచ్చరిక

Phani CH
|

Updated on: Nov 08, 2025 | 10:57 AM

Share

ప్రస్తుత కాలంలో పాన్‌ కార్డ్‌ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయింది. పాస్‌పోర్టులు, బ్యాంకు లావాదేవీలు తదితర వ్యవహారాలన్నింటికీ పాన్‌కార్డ్‌ కీలకంగా మారింది. అలాంటి పాన్‌కార్డ్‌ గురించి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీచేసింది. ప్రతిఒక్కరూ పాన్‌కార్డ్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయడం తప్పనిసరి. అయితే ఇప్పటికీ కొందరు పాన్‌కార్డ్‌కి ఆధార్‌ లింక్‌ చేయడంలేదు.

దీనివల్ల ఫ్యూచర్‌లో వారికి ఆర్ధిక లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు విధించిన గడువు ఇప్పటికే ముగియడంతో, లింక్ చేయని పాన్ కార్డులు నిరుపయోగంగా మారే ప్రక్రియ వేగవంతమైంది. దీనివల్ల వారి ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139AA ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పాన్‌కార్డును ఆధార్‌తో తప్పనిసరిగా అనుసంధానం చేయాలి. పన్ను ఎగవేతలను అరికట్టడం, నకిలీ పాన్ కార్డులను ఏరివేయడం, పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది. పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ, ఇంకా లక్షలాది మంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. గడువు ముగిసిపోవడంతో, ఇప్పుడు వీటిని లింక్‌ చేసుకోవాలంటే తప్పనిసరిగా రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పాన్‌కార్డ్‌ రద్దయితే మీరు చట్ట ప్రకారం పాన్ కార్డు లేని వ్యక్తిగానే పరిగణించబడతారు. ఫలితంగా మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయలేరు. మీకు రావాల్సిన పన్ను రిఫండ్లు నిలిచిపోతాయి. మీ జీతం, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ, ఇతర ఆదాయాలపై అధిక రేటుతో టీడీఎస్ కట్ అవుతుంది.రూ.50,000 మించిన బ్యాంకింగ్ లావాదేవీలు జరపడం కష్టమవుతుంది. కొత్తగా డీమ్యాట్ ఖాతా తెరవలేరు. ఆస్తుల క్రయవిక్రయాల్లో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాహనాలు కొనడం లేదా అమ్మడం వంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలు నిలిచిపోతాయి.అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంకా ఛాన్స్‌ ఉంది. రూ.1000 జరిమానా చెల్లించి, పాన్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనలను తేలికగా తీసుకోకుండా, వెంటనే మీ పాన్-ఆధార్ లింకింగ్ స్టేటస్‌ను చెక్ చేసుకోండి. ఒకవేళ లింక్ చేయకపోతే, వెంటనే చేయటం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడికి వెళుతుండగా చైన్‌ స్నాచింగ్‌ సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌

భయం భయంగా తిరుమలకు శ్రీవారి భక్తులు

కార్తీక పౌర్ణమి సందర్భంగా శివయ్యకు ఓ భక్తురాలి నివేదన.. ఏం చేసిందంటే

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఇక అధిక బిల్లుల బాధే ఉండదు

మరో ఆర్టీసీ బస్సు దగ్ధం.. ప్రయాణికులంతా సేఫ్