కార్తీక పౌర్ణమి సందర్భంగా శివయ్యకు ఓ భక్తురాలి నివేదన.. ఏం చేసిందంటే
కార్తీకమాసం శివునికి ప్రత్యేకమైన మాసంగా భావిస్తారు. కార్తీకమాసంలో రోజూ పండగే. ఈ నెలంతా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ప్రత్యేక అలంకరణలతో కార్తీకశోభ సంతరించుకుంటుంది. ప్రాతఃకాలంలో ఆలయాల్లో, ఇళ్లలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. శివాలయాల్లో వివిధ రకాల అభిషేకాలు చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కార్తీక శోభ ఉట్టిపడుతోంది.
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని ప్రత్యేకంగా భావిస్తారు. ఈ రోజు శివాలయాలన్నీ అందంగా ముస్తాబవుతాయి. భక్తులు కూడా తమ సమీపంలోని శివాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలోనే శృంగేరి శ్రీ శారదా ఫీఠం శివాలయంలో ఓ భక్తురాలు వేసిన శివపార్వతుల బొమ్మ అందరినీ ఆకట్టుకుంటోంది. తేజస్వి అనే భక్తురాలు కార్తీక పౌర్ణమి రోజు స్వామివారిని ప్రత్యేకంగా రూపొందించాలని అనుకుంది. వెంటనే ఓ ముప్పై కేజీల ఉప్పు తెప్పించి, అందులో వివిధ రంగుల్లో ఉన్న ముగ్గును కలిపింది. ముందుగా నల్లని రంగు కలిపిన ఉప్పుతో శివలింగం ఆకారాన్ని రూపొందించింది. దానిపైన పసుపు, ఎరుపు, నీలం, గులాబీ రంగులు కలిపిన ఉప్పుతో శివపార్వతుల రూపాన్ని తీర్చిదిద్దింది. ఆలయ ప్రాంగణంలో హోమగుండాల మధ్య ఏర్పాటుచేసిన శివపార్వతుల రూపం ఆకట్టుకుంటోంది. దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి ఈ రూపాన్ని రూపొందించినట్లు తేజస్వి చెప్పింది. దాదాపు ఇరవై ఐదు అడుగుల ఎత్తు, పది అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దిన ఈ చిత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయానికి వచ్చిన భక్తులు శివపార్వతుల సుందర రూపాన్ని చూసి మంత్రముగ్ధులవుతున్నారు. చిత్రాన్ని రూపొందించిన తేజస్విని అభినందిస్తూ ఆ చిత్రం చుట్టూ దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక అధిక బిల్లుల బాధే ఉండదు
మరో ఆర్టీసీ బస్సు దగ్ధం.. ప్రయాణికులంతా సేఫ్
ఆ పాత్రికేయుడి విగ్రహానికి ముద్దులతో మహిళల నివాళి.. ఎందుకో తెలుసా ??
గగనయాన్ ప్రయోగం వాయిదా.. అందుకేనా ??
నిన్న శబరిమల.. నేడు కంచి.. దేవుళ్ళకే శఠగోపం పెడుతున్న కేటుగాళ్లు
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

