ఆ పాత్రికేయుడి విగ్రహానికి ముద్దులతో మహిళల నివాళి.. ఎందుకో తెలుసా ??
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఓ జర్నలిస్ట్ విగ్రహం దగ్గరికి చాలా మంది వెళుతుంటారు. ఎక్కువ మంది మహిళలు జర్నలిస్ట్ విగ్రహానికి ముద్దులు పెడుతూ తమ అభిమానాన్ని చాటుతుంటారు. దీని వెనుక కారణమేంటో చూసినట్లయితే.. మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ విగ్రహం ఎవరిదో తెలుసా.. విక్టర్ నొయిర్ అనే పాత్రికేయుడిది. మూడో నెపోలియన్ బంధువైన బొనాపార్టే 1870లో విక్టర్ నొయిర్‌ను కాల్చి చంపాడు.
ఆ రోజుల్లో మంచి పాత్రికేయుడిగా పేరు పొంది ప్రజల గొంతుకగా నిలిచిన విక్టర్‌ను కాల్చి చంపడంపై ఫ్రెంచి ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది. అప్పట్లోనే ఆయన అంత్యక్రియల్లో దాదాపు లక్షమంది ప్రజలు పాల్గొన్నారట. విక్టర్ చివరి క్షణాల్లో ఎలా ప్రాణాలు విడిచారో.. అదే విధంగా విగ్రహాన్ని రూపొందించి పెట్టారు. ఆయన టోపీ కూడా కాళ్ల దగ్గర పడి ఉంటుంది. ఈ విగ్రహానికి కొందరు మహిళలు ముద్దుపెట్టి నివాళులర్పిస్తుంటారు. సంతాన లేమితో బాధపడే కొందరు మహిళలు.. ఎప్పుడైతే ఈ విగ్రహానికి ముద్దు పెట్టారో ఆ తర్వాత వారికి సంతానం కలిగిందట. అదే విషయం అందరికీ చెప్పడంతో ఇప్పుడు అదో నమ్మకంగా మారింది. ఇప్పటికీ వేలాది మంది ఫ్రాన్స్ వివాహితులు విగ్రహానికి ముద్దులు పెడుతుంటారు. ఇది మూఢనమ్మకమని భావించిన అధికార యంత్రాంగం.. 2004లో ఈ సమాధి చుట్టూ కంచె వేసింది. అయితే పారిస్ మహిళలు ఆందోళనలు చేయడంతో చివరకు దాన్ని తొలగించక తప్పలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గగనయాన్ ప్రయోగం వాయిదా.. అందుకేనా ??
నిన్న శబరిమల.. నేడు కంచి.. దేవుళ్ళకే శఠగోపం పెడుతున్న కేటుగాళ్లు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

