గుడ్‌న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే నవంబరు 1న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు కాస్త ఉపశమనం కలిగించాయి. 19 కిలోల LPG సిలిండర్‌పై రూ.5 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ప్రకటించాయి.
తగ్గిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,590.50 చేరింది. కోల్‌కతాలో రూ.1,694, ముంబైలో రూ.1,542, చెన్నైలో రూ.1,750, హైదరాబాద్‌లో రూ.1,812.50గా ఉంది. అయితే, గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వంట గ్యాస్ ధర రూ.850 నుంచి రూ.960 మధ్య ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన వీటి ధరలను చివరిసారిగా సవరించారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా సిలిండర్‌కు రూ. 50 పెంపు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
8.20 శాతం వడ్డీతో నెలనెలా ఆదాయం పోస్టాఫీస్ సూపర్ స్కీమ్..
అమ్మతో ప్రతి క్షణం విలువైనదే.. ఆయుష్షును పెంచేదే
ఆ కార్లను తుక్కుగా అమ్మేస్తున్నారు
పగలు టెకీలు.. రాత్రయితే క్యాబ్ డ్రైవర్లు .. ఏంటీ నయా ట్రెండ్
