మహిళలకు శుభవార్త.. ప్రతి ఒక్కరికి రూ.10 వేలు..

Updated on: Sep 04, 2025 | 6:39 PM

మహిళలకు శుభవార్త! బీహార్ ప్రభుత్వం 'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గర్ యోజన' ద్వారా స్వయం ఉపాధి కోసం రూ.10,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. జీవికా దీదీ కార్యక్రమంలో చేరిన మహిళలకు ఈ అవకాశం లభిస్తుంది. వ్యాపారం అభివృద్ధి చెందితే రూ.2 లక్షల వరకు రుణం కూడా పొందవచ్చు. ఎన్నికల వేళ మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

మహిళలకు ఇది నిజంగా పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగించేందుకు అనేక పథకాలు అమలవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలతో పాటుగా.. నెలకు 2500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇలాంటి హామీలే ఇప్పుడు దేశమంతా విస్తురిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ అడుగు ముందుకు వేసి ఈ మొత్తాన్ని భారీగా పెంచుతున్నారు. తాజాగా బిహార్‌లో కూడా ఇదే విధానాన్ని అమలు చేయబోతున్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్న బిహార్‌లో మహిళా ఓటర్లను ఆకట్టుకోవడం కోసం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం జీవిక దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గర్ యోజన పథకాన్ని ప్రకటించారు. మంత్రివర్గం దీన్ని ఆమోదించించడంతో మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ పథకంలో భాగంగా స్వయం ఉపాధి పొందాలని భావించే ప్రతి మహిళకు రూ.10 వేలు ప్రారంభ సహాయంగా అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ పథకం రాష్ట్రంలోని 2.7 కోట్ల కుటుంబాలలోని ప్రతి మహిళకు వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం మహిళలకు ఉపాధి కల్పనతో పాటుగా.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. దీని ద్వారా కుటుంబంలోని ఒక మహిళ మాత్రమే ప్రయోజనం పొందుతారు. దీని ద్వారా లబ్ధి పొందాలంటే.. సదరు మహిళ తప్పనిసరిగా జీవికా దీదీ స్వయం ఎస్‌హెచ్‌జీలో చేరాలి. స్వయం ఉపాధి పొందాలనుకు మహిళలకు ముందుగా రూ. 10 వేలు ఇస్తారు. ఆరు నెలల తర్వాత సదరు మహిళ తన వ్యాపారంలో విజయం సాధించిందని భావిస్తే.. దాన్ని విస్తరించడానికి రూ.2 లక్షల వరకు రుణం ఇవ్వనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భూమిపైకి దూసుకొస్తున్న ఏలియన్స్ వ్యోమనౌక? నవంబర్‌లో ఏం జరగబోతుంది?

నటి రన్యారావుకు రూ.102 కోట్ల జరిమానా

బ్యాంక్ జాబ్ కు రిజైన్.. యువతి పోస్ట్‌ వైరల్‌

దుబాయ్‌లో ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్న సామ్‌.. త్వరలోనే పెళ్లి

వినాయకుడికి నైవేద్యంగా బంగారు ఉండ్రాళ్లు! కేజీ ఎంతో తెలుసా?