గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు

Updated on: Jan 08, 2026 | 1:49 PM

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. సబ్సిడీ పొందాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో గ్యాస్ సబ్సిడీ నిలిచిపోవడమే కాకుండా, సిలిండర్ బుక్ చేసుకోలేరు. నకిలీలను తొలగించి అర్హులైన వారికి మాత్రమే ప్రయోజనాలు చేరేలా ఈ ప్రక్రియ చేపట్టింది. త్వరగా పూర్తి చేసి సబ్సిడీ అంతరాయం లేకుండా పొందండి.

ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. వెంటనే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో గ్యాస్ సిలిండర్‌కు ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది. మీకు రావాల్సిన గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు ఆగిపోతాయని, అంతేకాకుండా భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేరని హెచ్చరించింది. అందుకే వీలైనంత త్వరగా లబ్దిదారులు తమకు గ్యాస్ పంపిణీ చేస్తున్న ఏజెన్సీలను సంప్రదించి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది. దీని వల్ల గ్యాస్ సబ్సిడీ పొందటంలో ఎలాంటి అంతరాయం ఉండదని తెలిపింది. నకిలీ సబ్సిడీలను తొలగించి అర్హులైన వారు మాత్రమే లబ్ది పొందేలా ఈ కేవైసీ ప్రక్రియను దేశవ్యాప్తంగా కేంద్ర పెట్రోలియం శాఖ ప్రవేశపెట్టింది. కొంతమంది ఒకే పేరుపై వేర్వేరు చోట్ల గ్యాస్ సబ్సిడీ పొందుతున్నారు. అలాగే ఒకే ఇంట్లో ఒకరి కంటే ఎక్కువమంది రాయితీ పొందుతున్నారు. దీంతో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలనే నిబంధన విధించింది. కేవైసీ చేయించుకున్నవారికి మాత్రమే ప్రభుత్వాలు అందించే సబ్సిడీ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. లేకపోతే నిధులు ఆగిపోతాయని తెలిపింది. ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందేవారు మాత్రమే కాకుండా సాధారణ వినియోగదారులు కూడా ఖచ్చితంగా కేవైసీ చేయించుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద బీపీఎల్ కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తోంది. అలాగే సబ్సిడీపై వీరికి గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. కేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ నిధులు ఆగిపోయే అవకాశముంది. ఇక తెలంగాణలో కేవలం రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. కేవైసీ పూర్తి చేయకపోతే అవి నిలిచిపోయే ఛాన్సుంది. మీ ఇంటికి గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చే డెలివరీ బాయ్ ద్వారా కూడా మీరు కేవైసీ పూర్తి చేయవచ్చు. డెలివరీ బాయ్ దగ్గర బయోమెట్రిక్ డివైస్ ఉంటుంది. ఈ డివైస్‌లో మీ ఫింగర్‌ప్రింట్ ఇచ్చి కేవైసీ పూర్తి చేయవచ్చు. లేదా మీరు గ్యాస్ ఎక్కడైతే తీసుకున్నారో ఆ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ఈ ప్రక్రియ కంప్లీట్ చేయొచ్చు. ఇందుకోసం ఆధార్, గ్యాస్ పాస్‌బుక్, మొబైల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం మీ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన వెబ్ సైట్ లేదా యాప్‌లోకి వెళ్లి ఆధార్ నెంబర్, మొబైల్ ఓటీపీ ద్వారా కేవైపీ పూర్తి చేయొచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ… కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు! వీడియో వైరల్

తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్‌ కొడుకు

ఏపీలో రైతులందరికీ గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో అకౌంట్లోకి రూ.6 వేలు

కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం

అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్