Kia Electric Car: కియా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్క చార్జింగ్‌తో 528 కి.మీ ప్రయాణం..

|

Jun 02, 2022 | 9:40 AM

కియా ఎలక్ట్రిక్ కార్‌ ఈవీ6 ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. నటి క్యాథెరిన్‌, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ పాల్గొన్నారు. మూడు లక్షల రూపాయలు చెల్లించి ఈ వాహనాన్ని ముందుగా బుక్‌ చేసుకోవచ్చని


కియా ఎలక్ట్రిక్ కార్‌ ఈవీ6 ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. నటి క్యాథెరిన్‌, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ పాల్గొన్నారు. మూడు లక్షల రూపాయలు చెల్లించి ఈ వాహనాన్ని ముందుగా బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. భారతదేశంలో ప్రీమియం ఆఫరింగ్‌గా 100 మంది వినియోదారులకు ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ బేసిస్‌లో ఈవీ6ను జూన్‌ 2022లో విడుదల చేయనున్నారు.అత్యంత వేగంగా చార్జింగ్‌ జరుగుతుందని కంపెనీ చెబుతోంది. ఈవీ 6 ఇండియా వెర్షన్‌లో 77.4 కిలోవాట్‌ హవర్‌ లిథయం అయాన్‌ బ్యాటరీ ఇచ్చారు. ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 528 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుంది. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని 5.2 సెకన్లలో అందుకుంటుంది. కియా ఈవీ6లో సౌకర్యవంతమైన ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, డ్రైవర్‌, ప్యాసెంజర్‌ రిలాక్సేషన్‌ సీట్లు, రిమోట్‌ ఫోల్డింగ్‌ సీట్లు, ఏఆర్‌ హెడ్‌ అప్‌ డిస్‌ప్లే వంటివి ఇందులో ఉన్నాయి. భద్రత పరంగా 8 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. కియా ఈవీ 6 వాహనం భారతదేశంలో ఐదు రంగుల్లో లభ్యమవుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Follow us on