Explainer: క్రెడిట్ కార్డ్ – రెండు వైపులా పదునున్న కత్తి

|

Aug 08, 2024 | 1:11 PM

రెండు మూడేళ్లుగా దేశంలో కోట్లాది క్రెడిట్ కార్డు హోల్టర్లలో కనీసం 30-40 శాతం మంది మినిమమ్ బిల్స్ కడుతూనే నెట్టుకొస్తున్నారు.  దేశంలో రోజు రోజుకీ క్రెడిట్ కార్డుపై పెట్టే ఖర్చులు ఆకాశానికి తాకుతున్నాయి. అదే సమయంలో చేసిన అప్పుని సమయానికి కట్టలేక... మినిమమ్ బిల్స్ కట్టే వారి సంఖ్య, డీ ఫాల్టర్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ ఇంతగా లేదు. జస్ట్ పదేళ్ల క్రితం వరకు ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డు మనకు ఇవ్వాలంటే..

రెండు మూడేళ్లుగా దేశంలో కోట్లాది క్రెడిట్ కార్డు హోల్టర్లలో కనీసం 30-40 శాతం మంది మినిమమ్ బిల్స్ కడుతూనే నెట్టుకొస్తున్నారు.  దేశంలో రోజు రోజుకీ క్రెడిట్ కార్డుపై పెట్టే ఖర్చులు ఆకాశానికి తాకుతున్నాయి. అదే సమయంలో చేసిన అప్పుని సమయానికి కట్టలేక… మినిమమ్ బిల్స్ కట్టే వారి సంఖ్య, డీ ఫాల్టర్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ ఇంతగా లేదు. జస్ట్ పదేళ్ల క్రితం వరకు ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డు మనకు ఇవ్వాలంటే.. సవాలక్ష రూల్స్.. రెగ్యూలేషన్స్ పెట్టేవి. కానీ ఇప్పుడు ఇస్తాం.. తీసుకోండంటూ వెంటపడుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ 2011లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం యాక్టివ్ గా ఉన్న క్రెడిట్ కార్టుల సంఖ్య దేశ వ్యాప్తంగా కేవలం ఒక కోటి 76 లక్షల 72వేల 337 మాత్రమే . అంతే సుమారు 2 కోట్ల కన్నా తక్కువే. అదే 2014 నాటికి అంటే 3 ఏళ్ల తర్వాత  వాటి సంఖ్య సుమారు 2 కోట్ల 3 లక్షల 62 వేలకు చేరింది. అంటే మూడేళ్ల కాలంలో పెరిగిన క్రెడిట్ కార్డుల సంఖ్య కేవలం సుమారు 30 లక్షలు. ఆ తర్వాత 2 ఏళ్లకు కూడా దేశంలో యాక్టివ్ గా ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య 3 కోట్లకు మించలేదు. 2018 నాటికి 4.4 కోట్లకు చేరింది. 2011తో పోల్చితే 7 ఏళ్లలో వాటి సంఖ్య డబుల్ అయినప్పటికీ 2019-2023 సంవత్సరాల మధ్య వచ్చిన క్రెడిట్ కార్డు బూమ్‌తో పోల్చుకుంటే నథింగ్ అనే చెప్పాలి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహేశ్- జక్కన్న సినిమాలో విక్రమ్.. అసలు విషయం చెప్పిన చియాన్

ఇదేం పిచ్చిరా అయ్యా!! నుదుటిపై పచ్చబొట్టుగా దర్శన్ పేరు

ఎన్టీఆర్, జాన్వీల రొమాన్స్ నెక్ట్స్ లెవెల్ అందర్నీ ఆకట్టుకుంటున్న ‘చుట్టమల్లె’

మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. మొక్కలు నాటితే అనసూయ సినిమా టికెట్లు ఫ్రీ..

ఇద్దరి మధ్యలోకి వెళ్లి.. గుక్కపెట్టి ఏడుస్తున్న శేఖర్ బాషా

Follow us on