మండిపోతున్న బంగారం.. రూ.3 లక్షలకు చేరువలో వెండి వీడియో

Updated on: Jan 13, 2026 | 3:44 PM

బంగారం ధరలు రోజు రోజుకు చుక్కలనంటుతున్నాయి. పెద్ద పండగ పూట బంగారం మాట ఎత్తాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనవరి 12 సోమవారం కూడా ధరలు భారీగా పెరిగాయి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఇతర ఆస్తుల నుండి ఉపసంహరించుకుంటున్నారు.

సేఫ్ హెవెన్ గా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో పసిడి ధరలు నింగిని తాకుతున్నాయి. జనవరి 12, సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,690 లు పెరిగి రూ.1,42,150లు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,550లు పెరిగి రూ.1,30,300 లకు చేరింది. వెండి కూడా భారీగానే పెరిగింది. కేజీకి రూ.12,000 పెరిగి రూ.2,87,000లు పలుకుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,42,300, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,450 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,150 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,30,300 పలుకుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..

బ్రష్​ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి

నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం