వాహనదారులకు అలర్ట్.. ఈ రహదారులపై ఫాస్టాగ్ వార్షిక పాస్ చెల్లదు
జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను అందుబాటులోకి తెచ్చింది. మూడువేల రూపాయలు చెల్లించి ఈ ఫాస్టాగ్ కొనుగోలు చేస్తే ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. అయితే కార్లు, జీపులు, వ్యాన్‌లు తదితర వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఈ పాస్ వర్తిస్తుంది.
సగటున 15 రూపాయలతో టోల్ ప్లాజాను దాటేందుకు ఈ పాస్ ఉపయోగపడుతుంది. వాహనదారుల నుంచి కూడా ఈ పాస్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. కేవలం 24 గంటల్లోనే 1.4 లక్షల మంది ఈ పాస్‌ను కొనుగోలు చేశారు. అయితే ఈ ఫాస్టాగ్ కొన్ని టోల్ ప్లాజాల వద్ద మాత్రమే ఉపయోగపడుతుంది. వ్యక్తిగత వాహనదారులకు ఊరట కల్పించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ పాస్, వ్యక్తిగత కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలకు చెల్లుబాటు కాదు. వాహన్ డేటాబేస్ ఆధారంగా వాహన రకాన్ని గుర్తిస్తారు. ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవారు మళ్లీ కొత్త ఫాస్టాగ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. పాత ఫాస్టాగ్‌తోనే టోల్‌పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే, ఈ ఫాస్టాగ్ కేవలం జాతీయ రహదారులకు మాత్రమే వర్తిస్తుంది. జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేల మీద ఉండే టోల్ ప్లాజాల వద్ద మాత్రమే ఉపయోగపడుతుంది. సరళంగా చెప్పాలంటే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), జాతీయ రోడ్లు, రహదారులు మంత్రిత్వశాఖ నిర్వహించే టోల్‌ప్లాజాల వద్ద మాత్రమే ఈ పాస్ చెల్లుబాటు అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 11 వందల 59 టోల్ ప్లాజాల వద్ద పాస్ చెల్లుతుంది. కానీ, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు నిర్వహించే ఎక్స్‌ప్రెస్ వేలు, రహదారులపై ఉండే టోల్ ప్లాజాల వద్ద ఈ పాస్ చెల్లదు. ఉదాహరణకు హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. దీన్ని ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థ ప్రస్తుతం నిర్వహిస్తోంది. ఇక్కడ వార్షిక పాస్ వర్తించదు. అలాగే, ఏపీలో తిరుమల కొండపైకి వెళ్లేటప్పుడు సప్తగిరి టోల్ ప్లాజా వద్ద కూడా ఈ వార్షిక పాస్ చెల్లదు. ఆయా టోల్‌ప్లాజాలు దాటినప్పుడు సాధారణ ఛార్జీలు వర్తిస్తాయి. కాబట్టి ఫాస్టాగ్ తీసుకునేటప్పుడు మీరు దాటబోయే టోల్ ప్లాజాలు ఎవరి పరిధిలోకి వస్తాయో తెలుసుకోవడం అవసరం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణభయంతో తలను నొక్కిపట్టాడు.. పాముకు ఏమైందంటే..
కప్పు ఛాయ్ వెయ్యి రూపాయలా? పేదవాడిలా ఫీల్ అయ్యా
భారతీయుడ్ని పెళ్లాడా.. లైఫ్ ఎలా ఉందంటే.. బ్రెజిల్ యువతి పోస్ట్ వైరల్
ప్రైమరీ స్కూల్‌లోకి ఏనుగు పిల్ల అడ్మిషన్ కావాలేమో అంటున్న నెటిజన్లు
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

