ప్రాణభయంతో తలను నొక్కిపట్టాడు.. పాముకు ఏమైందంటే..
పామంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. పామును చూడగానే.. కాళ్లు ఆటోమేటిక్‌గా పరుగులు మొదలెడతాయి. పాము అని వినిపించినా చాలు గుండెల్లో భయం మొదలవుతుంది. పడుకున్న ఓ యువకుడి శరీరంపైకి తాజాగా ఓ పాము ఎగబాకింది. శరీరంపై ఎదో పాకుతున్నట్లు అనిపించి అతను కళ్లు తెరిచాడు. మీద పాము ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే పాము తలను గట్టిగా నొక్కిపట్టాడు.
పామంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. పామును చూడగానే.. కాళ్లు ఆటోమేటిక్‌గా పరుగులు మొదలెడతాయి. పాము అని వినిపించినా చాలు గుండెల్లో భయం మొదలవుతుంది. పడుకున్న ఓ యువకుడి శరీరంపైకి తాజాగా ఓ పాము ఎగబాకింది. శరీరంపై ఎదో పాకుతున్నట్లు అనిపించి అతను కళ్లు తెరిచాడు. మీద పాము ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే పాము తలను గట్టిగా నొక్కిపట్టాడు. భయంతో ఏడ్చుకుంటూ ఆస్పత్రికి పరుగులు తీశాడు. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. షాక్ అయ్యేంతలా ఏం జరిగిందో తెలియాలంటే.. పూర్తి స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్, తిస్‌గానా గ్రామానికి చెందిన 32 ఏళ్ల గోవింద రాత్రి తన ఇంట్లో నిద్రపోతూ ఉన్నాడు. ఓ పాము అతడిపైకి పాకింది. దీంతో అతడికి మెలుకువ వచ్చింది. శరీరంపై పాము ఉండటం చూసి షాక్ అయ్యాడు. భయంతో గుండె జారింది. వెంటనే పాము తలను చేత్తో పట్టుకున్నాడు. గట్టిగా అరవసాగాడు. అతడి అరుపులు విని కుటుంబసభ్యులు అక్కడికి వచ్చారు. అతని చేతిలో పామును చూసి వారు షాక్ అయ్యారు. గోవింద అరుస్తూ.. ఏడుస్తూ ఉంటే పాము అతడ్ని కరిచిందని అనుకున్నారు. వెంటనే అతడ్ని తీసుకుని మాదవర కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లారు. గోవింద అక్కడికి వెళ్లగానే ‘డాక్టర్ కాపాడండి. పాము కాటేసింది’ అంటూ ఏడవటం మొదలెట్టాడు. డాక్టర్లు అతడ్ని పరీక్షించారు. పాము అతడ్ని కాటు వేయలేదని తేలింది. పామును దూరంగా తీసుకెళ్లి వదిలేయమని చెప్పారు. అతడు పామును దూరంగా తీసుకెళ్లి పడేశాడు. అయితే, ఆ పాములో చలనం లేదు. చచ్చిపోయింది. ఆ యువకుడు ప్రాణ భయంతో పాము తలను అరగంట పాము పట్టుకోవటంతో అది చనిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కప్పు ఛాయ్ వెయ్యి రూపాయలా? పేదవాడిలా ఫీల్ అయ్యా
భారతీయుడ్ని పెళ్లాడా.. లైఫ్ ఎలా ఉందంటే.. బ్రెజిల్ యువతి పోస్ట్ వైరల్
ప్రైమరీ స్కూల్‌లోకి ఏనుగు పిల్ల అడ్మిషన్ కావాలేమో అంటున్న నెటిజన్లు
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
కత్తితో కారు దిగిన మహిళ.. కారు పైకి కోడిగుడ్లు విసిరిన దుండగులు

