ప్రైమరీ స్కూల్‌లోకి ఏనుగు పిల్ల అడ్మిషన్ కావాలేమో అంటున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతాయి. వీటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా ఓ గున్న ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను కట్టిపడేస్తుంది. ఓ పాఠశాల ఆవరణలోకి వచ్చిన అనుకోని అతిథిని చూసి అడ్మిషన్ కావాలేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
కేరళ-కర్ణాటక సరిహద్దులోని పుల్పల్లి నుండి దాదాపు 14 కి.మీ దూరంలో ఉన్న చెకాడి గ్రామం మూడు వైపులా అడవితో చుట్టుముట్టబడి ఉంది. వరి పొలాలకు, ప్రధానంగా గిరిజన సమాజం ఎక్కువగా నివసించే ప్రాంతం ఇది. ఇక్కడ ప్రీ-ప్రైమరీ తరగతులను కూడా కలిగి ఉన్న ప్రభుత్వ LP స్కూల్ దాదాపు 115 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక ఎకరంలో విస్తరించి ఉన్న ఈ క్యాంపస్‌లో తరచూ ఏనుగులు సంచరిస్తూ ఉంటాయి. స్కూలు అయిపోయాక.. సూర్యాస్తమయం తర్వాత తరచుగా మందలుగా ఏనుగులు ఇక్కడ సంచరిస్తాయి. ఈ క్రమంలోనే అనుకోకుండా సోమవారం ఉదయం ఓ ఏనుగు పిల్ల ఒంటరిగా స్కూల్ ఆవరణలోకి వచ్చింది. పిల్లల కేరింతలు, సందడి చూసి వారితో ఆడుకోవాలనుకుందో, లేక తనుకూడా స్కూలుకి వెళ్లి పాఠాలు చదువుకోవాలనుకుందో కానీ గున్న ఏనుగు సరాసరి ఓ క్లాస్‌రూమ్ దగ్గరకు వెళ్లింది. అనంతరం ఆ పాఠశాల ఆవరణలో తిరుగుతూ సందడి చేసింది. గున్న ఏనుగును చూసి ఇటు ఉపాధ్యాయులు, విద్యార్ధులు ఆశ్చర్యపోయారు. చిట్టి ఏనుగును చూసి విద్యార్ధులు సంతోషంతో కేరింతలు కొట్టారు. ఈ సంఘటన మొత్తం స్కూల్లోని సీసీ కెమెరాలో రికార్డైంది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ గున్న ఏనుగు వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిట్టి ఏనుగుకి అడ్మిషన్ కావాలేమో అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది కదా.. అసలైన పేరెంటింగ్ అంటే.. కూతురికి జీవిత పాఠాలు నేర్పుతున్న తండ్రి
EPFO: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్
Jio Recharge Plan: రిలయన్స్ జియో ఈ ప్లాన్ కూడా నిలిపివేసిందా?
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
కత్తితో కారు దిగిన మహిళ.. కారు పైకి కోడిగుడ్లు విసిరిన దుండగులు

