AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా.. అసలైన పేరెంటింగ్ అంటే.. కూతురికి జీవిత పాఠాలు నేర్పుతున్న తండ్రి

ఇది కదా.. అసలైన పేరెంటింగ్ అంటే.. కూతురికి జీవిత పాఠాలు నేర్పుతున్న తండ్రి

Phani CH
|

Updated on: Aug 25, 2025 | 8:08 PM

Share

ఇప్పటి పిల్లలకు స్కూల్‌, ట్యూషన్‌, ఇల్లు, మొబైల్‌ ఫోన్‌ తప్ప మరో ప్రపంచం తెలియని దుస్థితిని మనం చూస్తున్నాం. దీంతో, పరీక్షలలో మార్కులు రాకపోవటం వంటి చిన్న చిన్న కారణాలకే పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. వారిలో కొందరు భయంతో ఆత్మహత్యలూ చేసుకోవటం మనం చూస్తున్నాం. మరోవైపు.. తమ పిల్లలు రేపటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని, అందుకు అవసరమైన మానసిక స్థైర్యాన్ని, అవగాహనను కల్పించాలని ఆలోచించే తల్లిదండ్రులు కూడా బహుకొద్ది మందే.

చదువుతో బాటు జీవితపు వాస్తవికతను నేర్పగలిగితే.. రేపటి తరం అద్భుతంగా రాణిస్తుందని నమ్మిన ఓ తండ్రి.. తన కూతురి చేత.. నిమ్మరసం అమ్మించేందుకు ఏర్పాట్లు చేశాడు. దీనివల్ల వ్యాపార సూత్రాలతో బాటు వ్యక్తుల ఆలోచనా ధోరణి, డబ్బు విలువ వంటివి అవగాహన అవుతాయని ఆ తండ్రి భావించాడు. దీనిని చూసిన purvaagx అనే ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో తీసి పోస్ట్ చేయటంతో ఆ చిన్నారి తండ్రి ఆలోచనను పలువురు ప్రశంసిస్తున్నారు. ఆ వీడియోలో ఓ ఏడేళ్ల చిన్నారి నిమ్మరసం అమ్ముతూ ఉంటుంది. ఆ బాలిక పక్కనే ఆమె అమ్మమ్మ, చిన్నారి తండ్రి కూడా ఉన్నారు. తర్వాత ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆ బాలిక తండ్రితో మాట్లాడుతూ.. ‘మీరు రిచ్ డాడీ..పూర్ డాడీ’ పుస్తకం చదివారా అని అడుగుతాడు. దానికి ఆయన బదులిస్తూ.. తాను, తన కూతురు కలిసి ఆ పుస్తకాన్ని చదువున్నట్లు జవాబిస్తాడు.ఆ బుక్ చదివిన తర్వాత.. తన కూతురు..లెమన్ వాటర్ అమ్మే స్టాల్ పెడతానని అడిగిందని, అందుకే తాను స్టాల్ ఏర్పాటు చేశానని ఆ తండ్రి చెప్పుకొచ్చాడు. తన కూతురుకి సమాజం పట్ల అవగాహన కల్పించటానికి, డబ్బు విలువ, ఆర్థిక స్వాతంత్ర్యం, మనుషులతో ఎలా మాట్లాడాలి.. వంటి అంశాల మీద అవగాహన కల్పించేందుకే.. నిమ్మరసం అమ్మే కార్యక్రమం ఏర్పాటు చేశానని ఆ బాలిక తండ్రి వివరించాడు. తన కూతురు ఉన్నత చదువులు చదవాలి..మంచి ర్యాంక్ రావాలి అని మాత్రమే గాక కష్టపడటం, కొన్ని విలువలతో జీవించటం వంటివి నేర్పాలనేదే తన కోరిక అని ఆ తండ్రి వివరించాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

EPFO: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్

Jio Recharge Plan: రిలయన్స్ జియో ఈ ప్లాన్ కూడా నిలిపివేసిందా?

NTR సినిమాపై నారా రోహిత్ కుట్ర.. క్లారిటీ

సినిమాలు మానేసి.. జాతకాలు చెప్పుకుంటున్న హీరోయిన్

ఓవర్ యాక్షన్ ఎఫెక్ట్.. బిగ్‌బాస్‌కు రాకుండా గెంటేసిన జడ్డెస్