వినియోగదారులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారిన నిబంధనలు ఇవే!
నవంబర్‌లో వివిధ ఆర్థిక అంశాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇవి మీ రోజువారీ ఆర్థిక పరిస్థితులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ఆధార్ అప్‌డేట్ ఫీజులు, బ్యాంక్ నమోదులో మార్పుల నుండి కొత్త GST స్లాబ్‌లు, కార్డ్ ఫీజుల వరకు ఈ మార్పులున్నాయి. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పిల్లల ఆధార్ కార్డులకు, బయోమెట్రిక్ అప్‌డేట్‌ల కోసం 125 రూపాయిలు రుసుమును రద్దు చేసింది.
ఈ సదుపాయం ఒక సంవత్సరం పాటు ఉచితం. పెద్దలకు.. పేరు, పుట్టిన తేదీ, చిరునామా లేదా మొబైల్ నంబర్ వంటి వివరాలను అప్‌డేట్ చేయడానికి 75 రూపాయిల పే చేయాల్సి ఉంటుంది. వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ అప్‌డేట్‌లకు 125 రూపాయిలను చెల్లించాలి. నవంబర్ 1 నుండి బ్యాంకు వినియోగదారులు.. తమ ఖాతా, లాకర్ లేదా సేఫ్ డిపాజిట్ అకౌంట్ ఒక్కొక్కదానికి నలుగురిని నామినేట్ చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు నిధులను అందుబాటులోకి తీసుకురావడం, యాజమాన్య హక్కుల వివాదాలను నివారించడమే ఈ కొత్త నియమం లక్ష్యం. నామినీలను జోడించే లేదా మార్చే ప్రక్రియను కూడా వినియోగదారుల కోసం సరళీకృతం చేశారు. నవంబర్ 1 నుండి ప్రభుత్వం.. GST లో కూడా మార్పులు వచ్చాయి. నవంబర్ 1 నుండి, SBI.. తన కార్డ్ వినియోగదారులు యాప్‌ల ద్వారా చేసే విద్యా సంబంధిత చెల్లింపులపై 1శాతం రుసుము వసూలు చేస్తుంది. ఎస్‌బీఐ కార్డ్‌ని ఉపయోగించి వారి డిజిటల్ వాలెట్‌కు రూ.1,000 కంటే ఎక్కువ మొత్తాన్ని లోడ్ చేసినట్లయితే.. ఒక శాతం రుసుము చెల్లించాలి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీ వెబ్‌సైట్లు, పీఓఎస్ మెషీన్ల వద్ద చేసే చెల్లింపులకు ఈ ఫీజు వర్తించదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లు శిరీష్ నిశ్చితార్థం వేడుక ఫోటోలు వైరల్
గుడ్‌న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
8.20 శాతం వడ్డీతో నెలనెలా ఆదాయం పోస్టాఫీస్ సూపర్ స్కీమ్..
