త్వరలో ఆ 4 ప్రభుత్వ బ్యాంకుల విలీనం

Updated on: Oct 18, 2025 | 7:05 PM

భారతీయ బ్యాంకింగ్‌ రంగంలో పెను మార్పులు జరగబోతున్నాయా? అంటే కేంద్ర ప్రభుత్వ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ నిర్ణయంలో భాగంగా పలు ప్రభుత్వరంగ బ్యాంకులు విలీనం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో.. దాని అనుబంధంగా ఉన్న ఎస్‌బీహెచ్‌ సహా 5 అనుబంధ బ్యాంకులు కలిసిపోయాయి.

ఇక ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, దేనా, విజయా, ఓబీసీ, యూబీఐ, సిండికేట్‌, అలహాబాద్‌ వంటి ఇంకొన్ని బ్యాంకులను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, కెనరా, ఇండియన్‌ బ్యాంకుల్లోకి విలీనం చేశారు. ఇప్పుడు మరికొన్ని బ్యాంకులు కనుమరుగవబోతున్నాయని ప్రభుత్వ వర్గాల నుంచి అదుతున్న సమాచారం. ఇందుకు 2027 మార్చి 31ని డెడ్‌లైన్‌గా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ తాజా నిర్ణయంలో భాగంగా.. ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ , సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా , బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా , బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలు.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్బీఐల్లో విలీనం కావచ్చని తెలుస్తున్నది. గతంలో ఆయా బ్యాంకుల విలీనం సమయంలో రకరకాల ఇబ్బందులు తలెత్తాయి. ఈసారి అధికారిక ప్రకటన చేయడానికి ముందు అడ్డంకులేమైనా ఉంటే వాటిని ముందుగానే తొలగించుకుంటే మంచిదన్నట్లుగా కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. 2017 నుంచి 2020 మధ్య కేంద్ర ప్రభుత్వం 14 చిన్నస్థాయి ప్రభుత్వ రంగ బ్యాంకులను 6 పెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో విలీనం చేసింది. 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఇప్పుడు 12కు దిగొచ్చింది. ఈ 12ను కూడా ఇంకా తగ్గించాలనే దిశగా కేంద్రం వెళుతున్నట్లు సమాచారం. ఆర్థిక సంస్కరణల పేరిట సర్కారీ బ్యాంకులను విలీనాల బాట పట్టిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సర్కారీ కొలువులు తగ్గిపోయి, నిరుద్యోగం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏటీఎం కేంద్రంలో తిష్టవేసిన ఆంబోతు.. చివరకు..

తేనెటీగలపై మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్.. సమీప భవిష్యత్తులో తేనె అనేదే ఉండదా ??

అతిగా స్మార్ట్‌ఫోన్ చూస్తే.. అంతే సంగతులు

అనారోగ్యాన్ని దాచి పెళ్లి చేసారని అనస్తీషియా ఇచ్చి భార్యను కడతేర్చాడు

1638 కార్డులతో జల్సా.. కట్ చేస్తే గిన్నిస్ రికార్డు.. కారణం అదే