టాక్స్‌ రీఫండ్ కోసం చూస్తుంటే.. ‘డిఫెక్టివ్ ఐటీఆర్’ నోటీస్​ వచ్చిందా ??

|

Aug 19, 2024 | 6:53 PM

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినవారు ఇప్పుడు రీఫండ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొందరికి ఈ మొత్తం చేతికి అందింది కూడా. అయితే మరికొందరికి మాత్రం ఆదాయపు పన్ను శాఖ నుంచి 'డిఫెక్టివ్‌ రిటర్న్‌' నోటీసులు వస్తున్నాయి. డిఫెక్టివ్ ఐటీఆర్ నోటీస్ రాగానే కంగారు పడిపోకూడదు. ముందుగా నోటీసు ఎందుకు వచ్చిందో పరిశీలించాలి.

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినవారు ఇప్పుడు రీఫండ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొందరికి ఈ మొత్తం చేతికి అందింది కూడా. అయితే మరికొందరికి మాత్రం ఆదాయపు పన్ను శాఖ నుంచి ‘డిఫెక్టివ్‌ రిటర్న్‌’ నోటీసులు వస్తున్నాయి. డిఫెక్టివ్ ఐటీఆర్ నోటీస్ రాగానే కంగారు పడిపోకూడదు. ముందుగా నోటీసు ఎందుకు వచ్చిందో పరిశీలించాలి. తరువాత మీ ఆదాయాలను సరిగ్గా నమోదు చేయాలి. ఫార్మ్‌ ఎంపికలో పొరపాటు ఉంటే, సరైన ఫార్మ్‌ ఎంచుకోవాలి. తగిన ఆధారాలతో తిరిగి రిటర్నులు దాఖలు చేయాలి. మీకు వచ్చిన ఆదాయానికి ఆధారం ఫారం-26 ఏఎస్. కనుక దీనిలో ఉన్న మొత్తానికి, యాన్యువల్ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్ AIS లో ఉన్న మొత్తానికి, అలాగే ఐటీ రిటర్నుల్లో నమోదు చేసిన ఆదాయానికి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉంటే, డిఫెక్టివ్ ఐటీఆర్​ నోటీసులు వస్తాయి. అంటే మీరు దాఖలు చేసిన ఐటీఆర్​లో తప్పులు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవాలని కోరుతూ, ఆదాయ పన్ను విభాగం మీకు నోటీసులు పంపిస్తుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సౌదీ యువరాజు సల్మాన్‌ ఆందోళన !! అలా చేస్తే.. నన్ను బతకనీయరు

Vakkaya: వాక్కాయ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

గజం భూమి ధర రూ.10 లక్షలు !! హైదరాబాద్​లో భూమి ధర అక్కడే ఎక్కువ

రాజీవ్‌గాంధీ vs తెలంగాణ తల్లి.. రగులుతున్న విగ్రహ రాజకీయం

మళ్లీ చెడ్డీ గ్యాంగ్ వస్తోంది.. మీ ఇళ్లు జాగ్రత్త !!