స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే ??
నవంబర్ 20 గురువారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.170, 22 క్యారెట్ల బంగారం రూ.150 తగ్గింది. కిలో వెండి ధర రూ.3000 తగ్గింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోని తాజా ధరలు ఇక్కడ చూడండి. కొనుగోలు ముందు ధరలు పరిశీలించడం మంచిది.
కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర నవంబరు 20 గురువారం స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.170 తగ్గి, రూ.1,24,690 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 తగ్గి రూ.1,14,300 కి చేరింది. వెండిధర కిలోకి రూ.3000 తగ్గి రూ.1,73,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,24,840 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.1,14,450 గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,690 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,14,300 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,460, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,000 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,860 , 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,450 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,24,690 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,14,300గా ఉంది. కిలో వెండి ధర రూ.1,73,000 లుగా ఉంది. ఈ ధరలు మధ్యాహ్న 12 గంటలకు నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉచితగా AI కోర్స్ ఈ విధంగా నేర్చుకోండి.. జీవితంలో సెటిల్ అవ్వండి
సార్ టాలెంట్ మామూలుగా లేదు.. స్మగ్లింగ్ లో సరికొత్తగా ట్రై చూసారుగా
అరే.. బాబు అవి పాములు రా.. పొట్లకాయలు కాదు.. మీకు వీడియో చూసే ధైర్యముందా
