Gold Price: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే
బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. శనివారంతో పోలిస్తే సోమవారం 10 గ్రాముల బంగారంపై 760 రూపాయిలు తగ్గింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధరలు ఇంకా పూర్తిగా తగ్గలేదు. సోమవారం జాతీయ స్థాయిలో బంగారం ధర లక్ష రూపాయలకు పైగానే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సుంకాల యుద్దం కారణంగా ప్రపంచ మార్కెట్లు, దేశీయ ఆర్థిక పరిస్థుతులలో వచ్చిన మార్పులతో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
ఆగస్టు 11, సోమవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,03,690 రూపాయిలు ఉండగా, 22 కేరట్ల గోల్డ్ ధర 96వేల 020 రూపాయిలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,27,700 రూపాయిలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల పసిడి ధర రూ.1,02,430, 22 కేరట్ల ధర రూ.93,900 రూపాయిలుగా ఉంది. ముంబై,చెన్నై, బెంగుళూరులో 24 కేరట్ల పసిడి ధర రూ.1,02,280, 22 కేరట్ల ధర రూ.93,750 ఉంది. వెండి ధర కిలో రూ.1,17,000 ఉంది. ముఖ్యంగా అమెరికా- భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మళ్లీ ఉద్రిక్తంగా మారడం,అమెరికా డాలర్ విలువ పడిపోవడం కీలక కారణాలుగా బంగారం హెచ్చు, తగ్గులుగా మారాయి. ఈ ధరల తగ్గుదల పసిడి మార్కెట్‌లో ఒక సానుకూల సంకేతంగా భావించబడుతుంది. రాబోయే పండుగలు, వివాహ సీజన్లు మొదలైన సందర్భాలలో బంగారం కొనుగోలుకు ఇది ప్రోత్సాహం కల్పించే అవకాశముందని విశ్లేషకులు చెప్పుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్లాస్టిక్‌తో పెనుముప్పు.. సంచలన రిపోర్ట్ విడుదల
చంద్రుడి మట్టిలో నీరుందా? తాజా పరిశోధన ఏం చెప్పింది?
ఏది కొనాలన్నా.. దాన్నే అడుగుతున్న ఇండియన్స్..