రూ.3 వేలకు పైగా పెరిగిన బంగారం.. తులం ఎంతంటే..

Updated on: Oct 14, 2025 | 9:04 PM

బంగారం ధర దారుణంగా పెరిగిపోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై విధించిన 100 శాతం సుంకాలతో పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్లోబల్ అస్థిర పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో పెట్టుబడిదారులు డాలర్ వదిలేసి బంగారం మీద ఫోకస్‌ చేయడంతో పసిడి ప్రియులకు భారీ షాక్ తగులుతోంది. సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది.

దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతాయనే వారికి నిరాశే ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.అక్టోబర్ 14, మంగళవారం 24 క్యారట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,280 పెరిగి రూ.1,28,680 లకు చేరింది. ఇక 22 క్యారట్ల 10 గ్రాముల బంగారంపై ధర రూ.3000 పెరిగి 1,17,950కు చేరింది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. కేజీ వెండిపై రూ.9000లు పెరిగి రూ.2,06,000లకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,830 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,18,100 పలుకుతోంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.3200 పెరిగి రూ.1,28,680 కు చేరింది. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.3000 పెరిగి రూ.1,17,950 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారట్ల గోల్డ్‌ ధర రూ.1,29,000లు, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,250 పలుకుతోంది. కోల్‌కతాలో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3200 పెరిగి రూ.1,28,680లు, 22 క్యారట్ల బంగారం ధర రూ.3000 పెరిగి రూ.1,17,950 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,680 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,950 పలుకుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,06,000లు పలుకుతోంది.ఈ ధరలు ఉదయం పదిన్నర గంటలకు నమోదైనవి. సాయంత్రానికి ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు. కనుక బంగారం కొనేందుకు వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌ చేసుకొని వెళ్లడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐదుగురికి పునర్జన్మనిచ్చిన జనసేన కార్యకర్త

జాలర్ల వలలో డూమ్స్‌ చేప.. ప్రకృతి విపత్తు తప్పదా

ఒక్క ఫోన్‌ కాల్‌తో ఆమె కోట్లకు పడగెత్తింది

ప్రపంచంలోనే అతి పెద్ద విమానం శంషాబాద్‌లో ల్యాండింగ్

ఉరివేసుకొని ప్రాణం తీసుకోబోయిన మహిళ.. కట్ చేస్తే..