దీపావళికి ముందు భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?

Updated on: Oct 19, 2025 | 1:23 PM

గత కొద్ది రోజుల నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు తగ్గు ముఖం పట్టాయి. ధనత్రయోదశి సందర్భంగా బంగారం కొన్న వారికి ఇది శుభవార్తే. 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.1,910 తగ్గింది. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,779. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,700. అక్టోబర్ 18, శనివారం నాటి ధరలు పరిశీలిస్తే..

గత కొద్ది రోజుల నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు తగ్గు ముఖం పట్టాయి. ధనత్రయోదశి సందర్భంగా బంగారం కొన్న వారికి ఇది శుభవార్తే. 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.1,910 తగ్గింది. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,779. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,700. అక్టోబర్ 18, శనివారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,30,086 రూపాయిలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,11,995 రూపాయిలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,72,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,101 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,11,995 ఉంది. ముంబైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,086 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,11,995గా ఉంది. చెన్నైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,091 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,12,000 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,086 ఉండగా, 22 కేరట్ల10 గ్రాముల ధర రూ.1,11,995 వద్ద కొనసాగుతోంది. భారతదేశంలో ధంతేరాస్, దీపావళి సందర్భంగా బంగారం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ధంతేరా‌స్‌కు ముందే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోవడంతో కొనుగోలుదారులు ఆలోచనలో పడ్డారు. కానీ ఇప్పుడు రేటు తగ్గడంతో కొనుగోళ్లు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్.. ఎల్‌ నినో, లా నినా.. ఈ రెండింటినీ.. గ్లోబల్‌ వార్మింగ్‌ మార్చేస్తోందిగా!

క్రికెట్​లో కొత్తగా ‘టెస్టు ట్వంటీ’ ఎంట్రీ

తిరుమల లడ్డూ ధరల పెంపు? ట్వీట్‌ లో టీటీడీ ఛైర్మన్‌ క్లారిటీ

జువెలరీ షాపే టార్గెట్‌.. అయ్యాకొడుకుల ఖతర్నాక్‌ ప్లాన్‌

తపాలా శాఖ అప్‌డేట్‌.. 24 గంటల్లోనే పార్సిల్‌ డెలివరీ