Gold Price Today: మహిళలకు భారీ షాక్.. రాత్రికి రాత్రే పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చరిత్ర సృష్టించాయి. సోమవారం రికార్డు స్థాయిలో పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1.35 లక్షలు దాటగా, కిలో వెండి రూ.2.31 లక్షలకు చేరింది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు ఈ పెరుగుదలకు కారణం. పెట్టుబడిదారులు, కొనుగోలుదారులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
దేశీయ మార్కెట్‌లో మహిళలకు బంగారం, వెండి ధరలు భారీ షాకిచ్చాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు సోమవారం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. డిసెంబర్ 20న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,170గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,990గా కొనసాగుతోంది. కాగా, సోమవారం అది మరింత పెరిగింది. వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే కిలో వెండి ధర రూ. 2లక్షలు దాటగా.. ప్రస్తుతం రూ. 2.50లక్షల వైపు దూసుకెళ్తోంది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై 5వేలు పెరిగింది. డిసెంబర్ 22, సోమవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,35,280 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,24,000 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,31,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,430 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,24,050 ఉంది. ముంబైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,280 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,24,000 ఉంది. చెన్నైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,150 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,24,800 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,280 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,24,000 వద్ద కొనసాగుతోంది. కోల్ కతా లో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,280 ఉండగా, 22 కేరట్ల10 గ్రాముల ధర రూ.1,24,050 వద్ద కొనసాగుతోంది. ఇక వెండిపై కూడా భారీగానే పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.5 వేల రూపాయిలు పెరిగి రూ.2,31,000గా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dubai: నదుల్లా మారిన దుబాయ్ రోడ్లు..
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
