EPFO: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్ న్యూస్..

Updated on: Aug 18, 2025 | 7:57 PM

పీఎఫ్ సేవలను సులభతరం చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే.. చందాదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఈపీఎఫ్‌ఓ. ఉద్యోగి మరణించిన తర్వాత.. పీఎఫ్ క్లెయిమ్ కోసం వారి కుటుంబసభ్యులు ఎక్కువ కాలం వేచిఉండాల్సిన అవసరం లేదు.. సకాలంలో డబ్బులు చెల్లించేలా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

దురదృష్టవశాత్తు, ఎవరైనా ఉద్యోగి మరణిస్తే.. అలాంటి సందర్భాల్లో, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరణించిన సభ్యుల కుటుంబానికి ఉపశమనం కలిగించేలా ప్రకటన చేసింది. ఈ మార్పుకు సంబంధించి ఈపీఎఫ్‌వో గురువారం కొత్త సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం.. ఇకపై.. మరణించిన చందాదారుడి ఖాతాలోని పీఎఫ్ మొత్తం.. నేరుగా అతడి మైనర్ పిల్లల పిల్లల ఖాతాల్లో నేరుగా డబ్బు జమకానుంది. కొత్త EPFO సర్క్యులర్ ప్రకారం, PF మొత్తాన్ని ఇకపై.. ఆ చనిపోయిన ఉద్యోగి యొక్క మైనర్ పిల్లల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తారు. దీనికి ఇకపై.. గతంలో మాదిరిగా కోర్టు నుంచి గార్డియన్‌షిప్ సర్టిఫికేట్ కూడా తీసుకురానవసరం లేదు. ఇప్పటివరకు, ఒక EPF సభ్యుడు మరణిస్తే, వారి కుటుంబం PF, పెన్షన్ లేదా బీమా మొత్తాలు పొందటానికి నెలల తరబడి ప్రాసెస్ సాగేది. ఇది ఆర్థికంగా ఆ కుటుంబాలకు భారమవుతోందని భావించిన కేంద్రం.. తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. క్లెయిమ్ మొత్తం సజావుగా విడుదలయ్యేలా చూసుకోవడానికి, EPFO సభ్యుని ప్రతి బిడ్డ పేరు మీద ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. PF, బీమా మొత్తం నేరుగా ఈ ఖాతాలలో జమ చేయబడుతుంది. క్లెయిమ్ మొత్తం జమ అయిన తర్వాత, దానిని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉపసంహరించుకోవచ్చు. EPFO ఒక నిర్దిష్ట EPF ఫారమ్ 20ని ఉపయోగిస్తుంది.. ఇది మరణించిన సభ్యుని PF ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి ఉద్దేశించబడింది. ఈ ఫారమ్‌ను మరణించిన సభ్యుని నామినీ, చట్టపరమైన వారసుడు లేదా సంరక్షకుడు పూరించవచ్చు. ఇది PF ఖాతా నుండి తుది క్లెయిమ్ చేయడానికి ఉపయోగించబడుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హమ్మయ్య .. చిరుత బోనులో చిక్కింది.. ఎక్కడంటే..

చెప్పిన పనులు చేసే రోబో జస్ట్ రూ. 5 లక్షలే..

సమోసా ఇండియాలో పుట్టిందా? కానే కాదు.. ఆ దేశంలో పుట్టి.. ఇక్కడికి..!

అన్నం పెడితే చాలు వాంతులు చేసుకుంటున్న చిన్నారి.. వైద్యులు టెస్టులు చేయగా

రాత్రి 7 గంటలలోపు భోజనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా