బంగారం కొంటున్నారా.. బీకేర్‌ఫుల్ తక్కువ క్వాలిటీ బంగారంపై ప్యూరిటీ ముద్ర
బంగారం కొనుగోలులో నకిలీ హాల్‌మార్క్ మోసాలు పెరిగిపోతున్నాయి. గుంటూరు, విజయవాడ, కాకినాడ వంటి ప్రాంతాల్లో స్వచ్ఛత లేని బంగారానికి కొందరు వ్యాపారులు నకిలీ హాల్‌మార్క్ ముద్ర వేస్తున్నారు. వినియోగదారులను మోసగిస్తున్న ఈ దందాపై BIS అధికారులు తనిఖీలు చేస్తున్నారు. స్వచ్ఛమైన బంగారాన్ని గుర్తించడం, మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం గురించి ఈ కథనం వివరిస్తుంది.
మొన్న గుంటూరు. నిన్న విజయవాడ. లేటెస్ట్‌గా కాకినాడ. మేలిమి బంగారాన్ని కూడా మలినం చేస్తున్నారు కొందరు కంత్రీగాళ్లు. హాల్‌మార్క్ విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తున్నారు. క్వాలిటీ లేని బంగారానికి కూడా ప్యూరిటీ ముద్ర వేస్తున్నారు. అనుమానమొచ్చి తనిఖీలు చేస్తే అడ్డంగా దొరికిపోతున్నారు. పసిడి రేటు పరుగులు పెడుతున్న వేళ.. చిన్న నగ కొనాలన్నా లక్షలు పోయాల్సి వస్తోన్న వేళ.. నకిలీ హాల్‌మార్క్ వార్తలు కొనుగోలుదారులను మరింత భయపెడుతున్నాయి. గతంలో విజయవాడ వన్‌టౌన్‌లోని జువెలరీ షాపుల్లో BIS అధికారుల తనిఖీల్లో కొందరు వ్యాపారుల లీలలు బయటపడ్డాయి. కోటేశ్వరరావు అనే వ్యక్తి అనధికారికంగా లేజర్ మిషిన్ ఏర్పాటు చేసి నగలపై హాల్ మార్కింగ్ వేస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మిషిన్‌ని, ల్యాప్‌టాప్‌ని సీజ్‌చేశారు. కల్తీ బంగారం నుంచి కాపాడటంతో పాటు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు మోసపోకుండా చూడటం, వీటి తయారీలో తయారీదారులు చట్టబద్ధమైన ప్రమాణాలను పాటించేలా చేయడం హాల్ మార్క్ ముఖ్య ఉద్దేశం. కానీ. కొన్నిచోట్ల ఫేక్ మార్కింగ్ జరుగుతోంది. నాసిరకం బంగారం కూడా స్వచ్ఛమైనదని నమ్మించే ప్రయత్నం జరుగుతోంది. విజయవాడలోనే కాదు.. కాకినాడలో బంగారు దుకాణాల తనిఖీల్లోనూ ఫేక్ హాల్‌మార్కింగ్ బయటపడింది. ఆభరణాల తయారీకి అనువైన 14, 18, 22 క్యారెట్‌లలో హాల్‌మార్కింగ్ జరుగుతుంది. 14 క్యారెట్ బంగారం 58.5 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. దీనికి హాల్‌మార్క్ గుర్తు 14K585. 75 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. 18 క్యారెట్ ఆభరణం హాల్‌మార్క్18K750గా ఉంటుంది. 22 క్యారెట్ ఆభరణం 91.6 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. దీనికి హాల్‌మార్క్ 22K916గా ఉంటుంది. హాల్‌మార్క్‌లో క్యారెట్ బీఐఎస్ స్టాంప్, హాల్‌మార్కింగ్ సెంటర్ మార్క్, ఇయర్ ఆఫ్ హాల్ మార్కింగ్, జ్యువెలరీ ఐడింటిఫికేషన్ మార్క్, ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ వంటి వివరాలు ఆభరణాలపై ఉంటాయి. ప్రతి ఆర్నమెంట్ ఆర్టికల్‌కీ సెపరేట్ నెంబర్ ఉంటుందని, సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ నెంబర్ జనరేట్ అవుతుందంటున్నారు బీఐఎస్ అధికారులు. లైసెన్స్ లేని వ్యాపారుల దగ్గర బంగారం కొని మోసపోవద్దని సూచిస్తున్నారు. ఈమధ్య గుంటూరు జిల్లాలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారుల సోదాల్లోనూ ఇలాంటి దందానే బయటపడింది. అందుకే అలర్ట్‌గా ఉండాలని, సర్టిఫైడ్ ఏజెన్సీలు నిర్ధారించే హాల్‌మార్క్‌నే ప్రమాణంగా తీసుకోవాలంటున్నారు బీఐఎస్ అధికారులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై టిటిడి క్లారిటీ.. ఈసారి స్థానికులకు ఇంపార్టెన్స్
రాత్రి వేళ ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు.. కట్‌చేస్తే.. అంత బట్టబయలు
ఎస్వీ యూనివర్శిటీలో చిరుత ప్రత్యక్షం.. భయాందోళనలో విద్యార్ధులు
ఓటుకు నోటు వద్దే వద్దు.. కోతులను తరిమితే చాలు కొత్త సర్పంచ్ మీరే
123 ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం.. 6 నిమిషాల పాటు పూర్తిగా చీకటి
