ఘాటెక్కిన వంటిల్లు..భగ్గుమంటున్న నిత్యావసర సరుకుల ధరలు

Updated on: Jul 25, 2026 | 1:28 PM

కరీంనగర్‌లో నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. అల్లం కిలో రూ.200 దాటగా, పసుపు రూ.250కు చేరింది. వెల్లుల్లి ధర కూడా రూ.300 మార్క్‌ను తాకే దిశగా సాగుతోంది. దిగుబడి తగ్గడం, సరఫరా కొరత, రవాణా ఖర్చుల పెరుగుదలతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కరీంనగర్ జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్నాయి. ముఖ్యంగా ప్రతి వంటింట్లో రోజూ వాడే అల్లం, వెల్లుల్లి, పసుపు ధరలు ఒక్కసారిగా రికార్డు స్థాయిలో పెరిగి సామాన్యులకు తీవ్ర షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే కూరగాయలు, పప్పుధాన్యాలు, వంటనూనెల భారంతో సతమతమవుతున్న మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలకు ఈ మసాలా దినుసుల ధరల పెరుగుదల మరింత భారం మోపింది. మార్కెట్లో కొద్దిరోజుల క్రితం కిలో రూ. 75గా ఉన్న అల్లం ధర ఇప్పుడు ఏకంగా రూ. 200 దాటింది. ఇక పసుపు కిలో రూ. 140 నుంచి రూ. 250కి చేరగా, వెల్లుల్లి ధర రేపోమాపో రూ. 300 మార్కును క్రాస్ చేయడానికి సిద్ధంగా ఉంది. దీంతో నెలవారీ కిరాణా బడ్జెట్ అస్తవ్యస్తమై గృహిణులు వంట ఖర్చులను నియంత్రించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షాలు లేక పంట దిగుబడి తగ్గడం, మార్కెట్‌లో డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడం మరియు రవాణా ఖర్చులు పెరగడమే ఈ ధరల మంటకు ప్రధాన కారణాలని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. రోజువారీ కూలీలు, చిరు ఉద్యోగులు ఈ ధరల మోతపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మార్కెట్‌లో సరఫరా పెంచి, ధరలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: గడ్డికోస్తున్న గొర్రెలు.. ఎక్కడంటే ?

వైన్స్‌లోకి దూసుకొచ్చిన చిరుత.. క్షణాల్లో అక్కడి వ్యక్తిని..

రిటైర్మెంట్ పొదుపు కోసం ఏది బెస్ట్ ?? మీకు సరిపోయే పొదుపు పథకం ఏది?

Auto Driver Love: నెటిజన్లను కదిలిస్తున్న ఆటోడ్రైవర్ ప్రేమకథా చిత్రం!

Vande Bharat: దసరా నాటికి ‘వందేభారత్ స్లీపర్’ రైళ్లు.. విజయవాడ డివిజన్‌లో పట్టాలెక్కనున్న ట్రైన్‌

Follow Us