EPFO: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్

Updated on: Aug 25, 2025 | 8:07 PM

ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ.. ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగి వేతనం, అతడు పనిచేసే సంస్థ నుంచి చందా రూపంలో డబ్బు వసూలు చేసి.. వాటిని పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి అందించటంతో బాటు అతడికి జీవితాంతం పెన్షన్ అందించే.. ఈ సంస్థ మారుతున్న కాలానికి అనుగుణంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

ఈ క్రమంలోనే 7 కోట్ల మంది ఉద్యోగులకు పలు ప్రయోజనాలు అందజేస్తోంది. ఇకపై.. పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే.. అతని కుటుంబానికి లభించే డెత్ రిలీఫ్ ఫండ్ మొత్తాన్ని రూ. 8.8 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే ఒక ఉద్యోగి ఈ తేదీ తర్వాత మరణిస్తే, అతని కుటుంబానికి రూ. 8.8 లక్షలకు బదులుగా రూ. 15 లక్షలు లభిస్తాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మార్పులకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే సంస్థ మరో శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1, 2026 నుండి ఈ ఎక్స్‌గ్రేషియా మొత్తం ఏటా 5 శాతం పెరుగుతుందని ప్రకటించింది. దీంతో, ఆ కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయం కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుంది. కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ రూల్స్ తెచ్చినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా పీఎఫ్ ఖాతాదారుడు మరణించిన తర్వాత, డబ్బు మైనర్ పిల్లలకు చెందాల్సి వస్తే, క్లెయిమ్ ప్రక్రియను ఇప్పుడు మరింత సులభతరం చేశారు. ఇంతకుముందు గార్డియన్‌షిప్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాల్సి వచ్చేది. దీంతో క్లెయిమ్ ప్రక్రియ ఆలస్యం అయ్యేది. కానీ, ఇప్పుడు ఈ నిబంధనను తొలగించారు. ఈ మార్పుతో మైనర్ పిల్లలు డబ్బును త్వరగా పొందే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jio Recharge Plan: రిలయన్స్ జియో ఈ ప్లాన్ కూడా నిలిపివేసిందా?

NTR సినిమాపై నారా రోహిత్ కుట్ర.. క్లారిటీ

సినిమాలు మానేసి.. జాతకాలు చెప్పుకుంటున్న హీరోయిన్

ఓవర్ యాక్షన్ ఎఫెక్ట్.. బిగ్‌బాస్‌కు రాకుండా గెంటేసిన జడ్డెస్

దేవుడి సినిమా దెబ్బకి చిత్తవుతున్న వార్ 2, కూలీ

Published on: Aug 25, 2025 08:05 PM