కూరగాయల సాగుతో.. ఏడాదికి రూ.కోటి సంపాదిస్తున్నఅమ్మాయి

Updated on: Nov 02, 2025 | 2:07 PM

ఇటీవలి కాలంలో గ్రామాల నుండి నగరాలకు వలస వెళ్తున్న ధోరణి పెరిగింది. వ్యవసాయంపై మక్కువతో యువత రివర్స్‌ ఇమ్మిగ్రేషన్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో కొందరు తమకున్న చిన్న చిన్న కమతాల్లోనే ఆర్గానిక్‌ పంటలు పండిస్తూ లక్షలు సంపాధిస్తున్నారు. ఈ సమయంలో ఇంజనీరింగ్‌ చదివిన ఓ అమ్మాయి కేవలం 3 సంవత్సరాలలో కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ సక్సెస్‌స్టోరీ కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలోనిది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూతురిని ఇంజనీరింగ్ చదివించారు. బెంగళూరులోని ఒక పెద్ద కంపెనీలో లక్షల జీతంతో ఉద్యోగం సంపాదించింది. అయితే, రోజారెడ్డి మనసు మాత్రం వ్యవసాయం మీదే ఉండేది. మహమ్మారి సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేసింది. అదే సమయంలో తన కలను నెరవేర్చుకునే అవకాశం వచ్చింది. అలా వ్యవసాయం వైపు అడుగులు వేసింది. అయితే, ఆమె ప్రయత్నాన్ని కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా.. ఆమె ముందడుగు వేసింది. తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలివేసి పూర్తి సమయం రైతుగా మారింది. 50 ఎకరాల భూమిలో సేంద్రీయ వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించటమే గాక వాటిని మార్కెట్ చేస్తూ.. ఏటా రూ.కోటి వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తోంది. రోజా రెడ్డి మొదట్లో బీన్స్, మెంతులు, క్యాప్సికమ్ వంటి కూరగాయలను సేంద్రీయ పద్ధతిలో పండించారు. ఇప్పుడు 500 మంది రైతులతో రాష్ట్రవ్యాప్తంగా సేంద్రీయ ఉత్పత్తులను సరఫరా చేయడం ప్రారంభించారు. రోజా రెడ్డి 6 ఎకరాలలో ప్రారంభించిన వ్యవసాయం 50 ఎకరాల పొలానికి పెరిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రన్నింగ్‌ రైలులో కొండచిలువ కలకలం.. పరుగులు పెట్టిన ప్రయాణికులు

విజువలైజేషన్ టెక్నిక్‌తో భయాలు దూరం

రీల్స్ చేయాలంటే డిగ్రీ ఉండాల్సిందే.. లేదంటే రూ లక్షల్లో ఫైన్‌!

అంతా బాగుంది.. కానీ క్రెడిట్ స్కోర్ పెరగటం లేదు.. ఎందుకిలా ??

చెట్లు ఎక్కే పాములు.. ఎక్కడో కాదు.. మన కోనసీమలోనే..