బంగారం కొంటున్నారా? నకిలీ గోల్డ్‌ని గుర్తించండిలా

Updated on: Oct 19, 2025 | 1:26 PM

ధన్‌తేరస్‌, దీపావళి .. ఈ రెండు ఫెస్టివల్స్ రాగానే మనదేశంలో బంగారం, వెండి అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీంతో వాటి ధరలకూ రెక్కలొస్తాయి. ఇంత ధర పెట్టి కొనే గోల్డ్, సిల్వర్ ఆభరణాలు స్వచ్ఛమైనవేనా? నాణ్యమైనవేనా? నకిలీవా? అనేది మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పనేం లేదు. ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం అంతకంటే లేదు.

కేవలం ‘బీఐఎస్ కేర్ యాప్’ను వినియోగిస్తే చాలు. ఇంతకీ ‘బీఐఎస్ హాల్ మార్క్’ అంటే ఏమిటి? ‘హెచ్‌యూఐడీ’ నంబర్ అంటే ఏమిటి? ‘బీఐఎస్ కేర్ యాప్​’తో నకిలీ గోల్డ్, సిల్వర్ ఆభరణాలను గుర్తించడం, ఫిర్యాదు చేయడం ఎలా? ఈ కథనంలో తెలుసుకుందాం. బీఐఎస్ అంటే ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’. బీఐఎస్ సంస్థ మన దేశంలో తయారయ్యే బంగారు, వెండి ఆభరణాలకు ‘హాల్ మార్కింగ్‌’ సర్టిఫికెట్లను ఇస్తుంది. బంగారం, వెండి నాణ్యత ప్రాతిపదికన ఈ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. హాల్ మార్కింగ్ పొందిన ప్రతీ ఆభరణానికి వేర్వేరుగా ఒక ‘హెచ్‌యూఐడీ’ నంబరును కేటాయిస్తారు. ‘హెచ్‌యూఐడీ’ అంటే ‘హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్’. ఇందులో ఆంగ్ల అక్షరాలు, సంఖ్యలు కలిసి మొత్తం 6 ఉంటాయి. ప్రతీ ఆభరణంపైనా బీఐఎస్ గుర్తుతో పాటు ‘హెచ్‌యూఐడీ’ నంబరు, స్వచ్ఛత సమాచారం ప్రచురించి ఉంటాయి. ఇవి మూడూ లేని ఆభరణాలను ఎవరైనా కొంటే జరిగే ఆర్థిక నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించదు. అందుకే ‘హాల్ మార్కింగ్‌’ ఉన్న పసిడి, వెండి ఆభరణాలను మాత్రమే కొనాలి. వాటిని రీసేల్ చేయడం కూడా చాలా ఈజీ. “బంగారం, వెండి ఆభరణాలను కొనడానికి వెళ్లే ముందు ఫోన్‌లో బీఐఎస్ కేర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇందులో హెచ్‌యూఐడీ నంబరును ఎంటర్ చేయగానే, ఆ ఆభరణం నకిలీదా? అసలుదా? అనేది తెలిసిపోతుంది. ఫలితంగా బంగారం కొనుగోలుదారులు మోసపోయే అవకాశాలే ఉండవు. నకిలీ బంగారాన్ని విక్రయించే వారిపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు కూడా చేయొచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దీపావళికి ముందు భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?

బాబోయ్.. ఎల్‌ నినో, లా నినా.. ఈ రెండింటినీ.. గ్లోబల్‌ వార్మింగ్‌ మార్చేస్తోందిగా!

క్రికెట్​లో కొత్తగా ‘టెస్టు ట్వంటీ’ ఎంట్రీ

తిరుమల లడ్డూ ధరల పెంపు? ట్వీట్‌ లో టీటీడీ ఛైర్మన్‌ క్లారిటీ

జువెలరీ షాపే టార్గెట్‌.. అయ్యాకొడుకుల ఖతర్నాక్‌ ప్లాన్‌