Apple Cars: యాపిల్ కార్లు లేనట్లేనా.? పదేళ్లపాటు రహస్యంగా సాగిన ప్రాజెక్ట్ షిఫ్ట్.
ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ టెస్లా కార్లకు పోటీగా యాపిల్ కార్లను తీసుకురావాలని అటానమస్ డ్రైవింగ్ సామర్ధ్యం కలిగిన కార్ల ప్రాజెక్టును చేపట్టింది. టైటన్ పేరిట పదేళ్లుగా ఇది రహస్యంగా కొనసాగుతోంది. అయితే ఈ ప్రాజెక్టును ఇప్పుడు యాపిల్ కంపెనీ పక్కన పెట్టింది. ఈ విషయాన్ని అంతర్గత సమావేశంలో ఉద్యోగులకు మంగళవారం కంపెనీ తెలియజేసింది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు యాపిల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ టెస్లా కార్లకు పోటీగా యాపిల్ కార్లను తీసుకురావాలని అటానమస్ డ్రైవింగ్ సామర్ధ్యం కలిగిన కార్ల ప్రాజెక్టును చేపట్టింది. టైటన్ పేరిట పదేళ్లుగా ఇది రహస్యంగా కొనసాగుతోంది. అయితే ఈ ప్రాజెక్టును ఇప్పుడు యాపిల్ కంపెనీ పక్కన పెట్టింది. ఈ విషయాన్ని అంతర్గత సమావేశంలో ఉద్యోగులకు మంగళవారం కంపెనీ తెలియజేసింది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు యాపిల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందిని యాపిల్ ఇతర బాధ్యతల్లోకి బదిలీ చేయనుంది. వీరిలో మెజారిటీ సభ్యులు కృత్రిమ మేధ విభాగానికి పనిచేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్ 2014 నుంచి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. కానీ, ఇప్పటి వరకు కారు ఎలా ఉంటుందో వెల్లడించలేదు. కానీ, సిలికాన్ వ్యాలీ రోడ్లపై దాన్ని పరీక్షించినట్లు పలుసార్లు వార్తలు వచ్చాయి. యాపిల్ వంటి బడా సంస్థ ఇలాంటి కీలక ప్రాజెక్టును పక్కన పెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
యాపిల్ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఐఫోన్ విక్రయాలు విపణిలో సంతృప్త స్థాయికి చేరుకున్నాయి. దీంతో కంపెనీ ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై దృష్టి సారిస్తూ వస్తోంది. అందులో భాగంగా అటానమస్ కార్లపైనా ఫోకస్ పెట్టింది. కార్ల తయారీలోకి ప్రవేశించాలనుకుంటున్నట్లు సీఈఓ టిమ్ కుక్ స్వయంగా ఓ సమావేశంలో సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పరిశోధన కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా టెస్లా కార్లకు పోటీగానే దీన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. యాపిల్ వినూత్న ఆవిష్కరణల విషయంలో వెనకబడి పోయిందనే వాదన టెక్ వర్గాల్లో కొంతకాలంగా వినిపిస్తోంది. ఐఫోన్‌లలోనూ పెద్దగా మార్పులేమీ ఉండట్లేదనే విమర్శలు వస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos