Reliance: జీతం లేని ఉద్యోగులుగా అంబానీ పిల్లలు..! 2021 నుంచి జీతం తీసుకోకుండనే పని..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన వ్యాపారంలోకి వారసులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రిలయన్స్ గ్రూప్ లో ప్రస్తుతం వివిధ బాధ్యతలు చూస్తున్న ఆకాశ్ అంబానీ, ఈశా అంబానీ, అనంత్ అంబానీలను కంపెనీ డైరెక్టర్ల బోర్డులోకి తీసుకునేందుకు తాజాగా కంపెనీ తీర్మానం చేసింది. వాటాదారుల అనుమతి కోసం ఈ తీర్మానాన్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా పంపించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన వ్యాపారంలోకి వారసులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రిలయన్స్ గ్రూప్ లో ప్రస్తుతం వివిధ బాధ్యతలు చూస్తున్న ఆకాశ్ అంబానీ, ఈశా అంబానీ, అనంత్ అంబానీలను కంపెనీ డైరెక్టర్ల బోర్డులోకి తీసుకునేందుకు తాజాగా కంపెనీ తీర్మానం చేసింది. వాటాదారుల అనుమతి కోసం ఈ తీర్మానాన్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా పంపించింది. డైరెక్టర్లుగా ఈ ముగ్గురూ ఎలాంటి వేతనం లేకుండానే పనిచేయనున్నారు. బోర్డు సమావేశాలకు హాజరైనందుకు కొంత ఫీజు, కంపెనీ ఆర్జించిన లాభాల్లో కొంత వాటాను వారికి చెల్లించేలా బోర్డు తీర్మానం చేసింది. ఈ మేరకు షేర్ హోల్డర్లకు పంపిన రిజల్యూషన్‌లో కంపెనీ వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి రిలయన్స్ కంపెనీ నుంచి జీతం తీసుకోకుండానే ముకేశ్ అంబానీ పనిచేస్తున్నారు. కంపెనీ లాభాల్లో వాటా మాత్రమే ఆయన అందుకుంటున్నారు. తండ్రి బాటలోనే ఆకాశ్, ఈశా, అనంత్ లు కూడా నడుస్తారని, కంపెనీ నుంచి ఎలాంటి జీతం తీసుకోబోరని కంపెనీ వర్గాలు తెలిపాయి. రిలయన్స్ కంపెనీలో ముకేశ్ అంబానీ సమీప బంధువులు నికిల్, హితల్ లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. వారు మాత్రం జీతంతో పాటు ఇతర సదుపాయాలు, కమీషన్లు తీసుకుంటున్నారు. రిలయన్స్ కంపెనీ ఇటీవలే ముకేశ్ అంబానీని మరో 5 ఏళ్లపాటు కంపెనీ ఛైర్మన్, సీఈఓగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ కంపెనీ బోర్డ్ నుంచి తప్పుకున్నారు. కానీ ఆమె కంపెనీ బోర్డ్ మీటింగ్ లకు శాశ్వత ఆహ్వానితురాలిగా ఉంటారు. ఈ ప్రత్యేకమైన వెసులుబాటు ముకేశ్ అంబానీ సహా కంపెనీలోని మరెవ్వరికీ లేకపోవడం విశేషం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

