Airtel validity Loan: ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్.. ఎమర్జెన్సీలో వ్యాలిడిటీ లోన్.!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మరో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే తమ కస్టమర్లకు డేటాను అప్పుగా ఇస్తున్న ఈ సంస్థ తాజాగా వ్యాలిడిటీ లోన్‌ను ప్రవేశపెట్టింది. యాక్టివ్‌గా ఉన్న ప్లాన్ గడువు ముగిసిన వెంటనే అత్యవసరంగా దీన్ని యూజర్లకు అందిస్తుంది. కేవలం ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. ఎమర్జెన్సీ వ్యాలిడిటీ లోన్‌లో భాగంగా యూజర్లు 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందొచ్చు.
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మరో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే తమ కస్టమర్లకు డేటాను అప్పుగా ఇస్తున్న ఈ సంస్థ తాజాగా వ్యాలిడిటీ లోన్‌ను ప్రవేశపెట్టింది. యాక్టివ్‌గా ఉన్న ప్లాన్ గడువు ముగిసిన వెంటనే అత్యవసరంగా దీన్ని యూజర్లకు అందిస్తుంది. కేవలం ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. ఎమర్జెన్సీ వ్యాలిడిటీ లోన్‌లో భాగంగా యూజర్లు 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందొచ్చు. దీని వ్యాలిడిటీ ఒకరోజు మాత్రమే. బేస్ ప్లాన్ కాలపరిమితి ముగిసిన వెంటనే రీఛార్జ్ చేసుకోలేని వారికి అత్యవసర సమయంలో ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుంది. గడువు ముగియగానే సీఎల్‌ఐ 56323 నుంచి వచ్చే మెసేజ్‌కు ‘1’తో రిప్లయ్ ఇచ్చి లోన్ కోసం అభ్యర్థించొచ్చు. ఈ లోన్‌ను ఎయిర్‌టెల్.. తర్వాతి రీఛార్జ్ నుంచి రికవర్ చేసుకుంటుంది. కొత్త ప్లాన్‌లో ఒక రోజు గడువును తగ్గించడం ద్వారా రికవరీని చేపడుతుంది. 115 రూపాయల నుంచి 3,359 రూపాయల వరకు వివిధ రీఛార్జ్ ప్లాన్‌లలో ఈ వ్యాలిడిటీ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. లోన్ తీసుకున్న తర్వాత దాన్ని రికవర్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోకపోతే.. మరోసారి వ్యాలిడిటీ లోన్ తీసుకోవడానికి వీలుండదు. ప్రస్తుతం ఈ ఆఫర్ ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కేరళ సర్వీసు ఏరియాలో మాత్రమే అందుబాటులో ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.