ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
చిన్న ఉద్యోగంతో కోటీశ్వరులు కావాలనే ఆశ నెరవేరదు అనుకుంటున్నారా? క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ప్రణాళికతో ఇది సాధ్యమే అంటున్నారు నిపుణులు. మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, బంగారం, సైడ్ బిజినెస్ వంటి వివిధ పెట్టుబడి మార్గాలను అన్వేషించి, మీ ఆర్థిక లక్ష్యాలను వేగంగా చేరుకోండి. దీర్ఘకాలిక సంపద సృష్టికి ఈ పద్ధతులు దోహదపడతాయి.
మనలో చాలా మందికి డబ్బు సంపాదించాలి. కోటీశ్వరులు కావాలి. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలి అనే కోరికలు ఉంటాయి. కానీ చేసే చిన్నపాటి జాబ్‌తో కోటీశ్వరులు కాగలరా అంటే మాత్రం ఎక్కువశాతం నో అనే సమాధానమే వస్తుంది. కానీ, జాగ్రత్తగా ప్లాన్ చేస్తే మాత్రం అది సాధ్యమేనంటున్నారు ఆర్థిరరంగ నిపుణులు. క్రమశిక్షణతో కూడి పెట్టుపడి ప్రణాళికలతో కోటీశ్వరులు కావడం అంత కష్టమేమీ కాదంటున్నారు. కేవలం సేవింగ్స్ ద్వారా కోటీశ్వరులు కావడం కష్టమే కానీ, రిస్క్‌లేని పెట్టుబడుల ద్వారా లక్ష్యాన్ని సాధించవచ్చని చెబుతున్నారు. చిన్న ఉద్యోగులకు మ్యూచువల్ ఫండ్స్ చక్కటి మార్గం అంటున్నారు నిపుణులు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒక నిర్ణీత మొత్తాన్ని సిప్ పద్దతిలో పెట్టుబడి పెడుతూ జీతం పెరిగే కొద్దీ సిప్ మొత్తాన్ని పెంచుకుంటూ పోతే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. దీర్ఘకాలంలో అధిక రాబడిని ఆశించేవారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలం. అయితే వీటిలో రిస్క్ కూడా ఎక్కువే అంటున్నారు. తక్కువ రిస్క్, స్థిరమైన రాబడి కోరుకునేవారికి బాండ్‌లు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వంటి స్థిర ఆదాయ సాధనాల్లో పెట్టుబడులు సూచిస్తున్నారు. పెట్టుబడిపై అధిక నియంత్రణ, అధిక రాబడిని కోరుకునే వారికి స్టాక్ మార్కెట్‌పై అవగాహన ఉండి నేరుగా పెట్టుబడి పెట్టడం ఒక మార్గం. ఇది మ్యూచువల్ ఫండ్స్ కంటే అధిక రిస్క్‌తో కూడుకున్నది. నాణ్యమైన కంపెనీల షేర్లను ఎంచుకోవడం వల్ల అద్భుతమైన రాబడిని పొందే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ కూడా ఉత్తమమైన మార్గమే. అద్దెల ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం, ఆస్తి విలువ పెరగడం ద్వారా దీర్ఘకాలికంగా వృద్ధి లభిస్తుంది. లిక్విడ్ క్యాష్ అవసరమైనప్పుడు ఆస్తులు అమ్ముడు పోని సవాళ్లను ఎదుర్కోవల్సి ఉంటుంది. రీట్స్ ద్వారా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి, భారీ వాణిజ్య ఆస్తుల యజమాన్యంలో భాగస్వామి కావచ్చు. అద్దెల ఆదాయంలో వాటాను పొందవచ్చు. ఉద్యోగానికి భంగం కలగకుండా ఫ్రీలాన్సింగ్, ఆన్‌లైన్ సేవలు, కన్సల్టింగ్, లేదా చిన్న ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చు. ఈ సైడ్ బిజినెస్ ద్వారా వచ్చిన అదనపు ఆదాయాన్ని పెట్టుబడి మార్గాల్లోకి మళ్లించడం ద్వారా అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకోవచ్చు. బంగారం లేదా సావరీన్ గోల్డ్ బాండ్‌లు, గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ. 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
రొమ్ములను తీయించుకున్న ఏంజెలినా జోలీ
అది కుక్క కాదు.. నా కూతురు ! డిపెండెంట్ హోదా ఇవ్వాలని కోర్టుకెక్కిన మహిళ