వైజాగ్ బస్టాండ్‌లో విషాద ఘటన.. ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి

Updated on: Aug 12, 2025 | 4:35 PM

విశాఖపట్నం ద్వారకా నగర్ బస్టాండ్‌లో నిన్న భయానక ఘటన చోటుచేసుకుంది. బస్టాండ్‌లో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, ఒక మహిళను ఢీకొట్టి మృత్యువాతకు గురి చేసింది. బస్సు నియంత్రణ కోల్పోవడంతో ప్లాట్‌ఫామ్ పైకి వెళ్లి అక్కడ ఉన్న మహిళను బలంగా ఢీ కొట్టడం తో బస్టాండ్‌లోని పిల్లర్‌కి, బస్సుకి మధ్యలో ఆ మహిళ చిక్కుకుని సంఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

విశాఖపట్నం ద్వారకా నగర్ బస్టాండ్‌లో నిన్న భయానక ఘటన చోటుచేసుకుంది. బస్టాండ్‌లో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, ఒక మహిళను ఢీకొట్టి మృత్యువాతకు గురి చేసింది. బస్సు నియంత్రణ కోల్పోవడంతో ప్లాట్‌ఫామ్ పైకి వెళ్లి అక్కడ ఉన్న మహిళను బలంగా ఢీ కొట్టడం తో బస్టాండ్‌లోని పిల్లర్‌కి, బస్సుకి మధ్యలో ఆ మహిళ చిక్కుకుని సంఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం, పోతనాపల్లి గ్రామానికి చెందిన గేదెల ముత్యాలమ్మ (45)గా గుర్తించారు. ఈ ఘటనతో బస్టాండ్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటన బస్టాండ్ భద్రతా చర్యలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్లాస్టిక్‌తో పెనుముప్పు.. సంచలన రిపోర్ట్ విడుదల

చంద్రుడి మట్టిలో నీరుందా? తాజా పరిశోధన ఏం చెప్పింది?

ఏది కొనాలన్నా.. దాన్నే అడుగుతున్న ఇండియన్స్‌..

వంటింటి సింక్‌లో వింత శబ్ధాలు.. ఏంటా అని చూస్తే..

పాపం ఫస్ట్ టైం దొంగతనం.. అడ్డంగా బుక్కైయ్యారుగా