Brahmastra in Bollywood: బాలీవుడ్‌ను చావుదెబ్బకొట్టిన బ్రహ్మాస్త్ర.. ఆశలు అడియాశలు అయ్యాయి..

| Edited By: Team Veegam

Oct 06, 2022 | 12:27 PM

రణబీర్‌, ఆలియా పెళ్లయ్యాక విడుదలైన సినిమా ఇది. వారిద్దరూ కలిసి నటించిన ఫస్ట్ సినిమా కూడా ఇదే. ఈ సినిమా కోసం నాలుగు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టరు. ఎప్పటి నుంచో ఊరిస్తున్న..


బాలీవుడ్ ఆశలు అడియాశలు అయ్యాయి. ఇండస్ట్రీకి పూర్వ వైభవం అన్నమాటే ఇప్పుడు ఉత్తి మాటగా మారిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న బీ టౌన్‌ ఎట్ ప్రపజెంట్‌ దిక్కులు చూస్తూ కూర్చింది. ఏం చేయాలో అర్థం కాక.. ఎలాంటి సినిమాలు తీయాలో తెలియక తల్లడిల్లుతోంది. సౌత్ ముందు చిన్నబోవడం పై మదన పడుతోంది.పాన్ ఇండియన్ సినిమాలంటూ నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాయి సౌత్ సినిమాలు.! అందులోనూ ప్రత్యేకించి టాలీవుడ్ సినిమాలు! ఇక వీటికి ఎదుర్కొనేందుకు.. మునుపటి బాలీవుడ్ను ఆవిష్కరించేందుకు ఓ రేంజ్లో నడుంబింగారు బాలీవుడ్ మేకర్స్. పాన్ ఇండియా సినిమా కాన్సెప్ట్ ను ఎత్తుకుని మరీ.. భారీ బడ్జెట్ తో రాజమౌళి రేంజ్లో బ్రహ్మాస్త్ర సినిమాను తెరకెక్కించారు. టాలీవుడ్ స్టార్ హీరో నాగ్‌ను కూడా ఈ సినిమాలో నటింపజేసి సౌత్‌లో ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు. మన పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళితో ఈ సినిమాను ప్రజెంట్ చేపించే ప్లాన్ చేశారు. ఆయన్ను ఈ సినిమా ప్రమోషన్లకు హెడ్‌ గా మార్చేశారు. సినిమా పై ఎన్నో అంచనాలు పెంచారు. బాలీవుడ్ ను మునుపటి ట్రాక్ పై ఎక్కించేందుకు బ్రహ్మాస్త్ర నే సరైనా సినిమాని అందరూ అనుకునేలా చేశారు.కాని కట్‌ చేస్తే.. సెప్టెంబర్ 9న రిలీజైన ఈ సినిమా పెద్దగా పాజిటివ్‌ టాక్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయింది. దాదాపు 65 పర్సెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా రిలీజ్ ముందు చిన్న వైబ్రేషన్ క్రియటే చేసినా.. రిలీజ్ తరువాత మాత్రం ఆ వైబ్రేషన్ను కంటిన్యూ చేయలేక పోయింది బ్రహ్మాస్త్ర. దీంతో ఈ సినిమా కూడా బాలీవుడ్‌ ఫేట్ మార్చేలా కనిపించడం లేదంటూ.. కామెంట్స్ చేస్తున్నారు ఫిల్మీ అనలిటిక్స్. రణ్భీర్ వల్ల కాలేదు మరే హీరో వల్ల అవుతుందో చూడాలని అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

 

Published on: Sep 12, 2022 11:32 AM