పాదాలకు చెప్పులు, షూ లేకుండా వాకింగ్‌ చేయండి.. ఫలితాలు చూస్తే షాకవుతారు

Updated on: Aug 09, 2025 | 6:53 PM

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పౌష్టికాహారం తీసుకుంటే సరిపోదు.. వ్యాయామం కూడా తప్పనిసరి. ఈ వ్యాయామం కోసం అందరూ జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేయలేరు. అయితే అందరికీ అందుబాటులో ఉండే, సులభమైన ఆరోగ్యకరమైన ఎక్సర్‌సైజ్‌ వాకింగ్‌. అయితే, వాకింగ్‌ అనగానే అందరూ షూలు, చెప్పులు వేసుకొని వాకింగ్‌ చేస్తారు.

కానీ కాళ్లకు ఇవేవీ ధరించకుండా వాకింగ్‌ చేస్తే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. కాళ్లకు చెప్పులు, షూ వేసుకుండా నేరుగా నేలపై నడవటాన్ని బేర్ ఫుట్ వాకింగ్ అంటారు. దీనివల్ల పాదాలు, కాళ్ల కండ‌రాల‌పై ఒత్తిడి ప‌డుతుంది. దీంతో ఆయా భాగాలు మ‌రింత శ్రమిస్తాయి.. తద్వారా మరింత దృఢంగా మారుతాయి. ఆయా భాగాల్లో మొత్తం 29 ర‌కాల కండ‌రాలు ఉంటాయి. అవ‌న్నీ యాక్టివేట్ అవుతాయి. ఎముక‌లు, కీళ్లు, లిగ్‌మెంట్స్ దృఢంగా మారుతాయి. దీంతో పాదాలు, మ‌డ‌మ‌ల‌కు బ‌లం ల‌భిస్తుంది. గాయాల బారిన ప‌డ‌కుండా ఉంటారు. బేర్ ఫుట్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మోకాళ్లు, తుంటి, వెన్నెముక‌కు సైతం వ్యాయామం అవుతుంది. దీంతో శ‌రీరం స‌రిగ్గా బ్యాలెన్స్ కూడా అవుతుంది. మాటి మాటికీ తూలిప‌డిపోయే ప‌రిస్థితి ఉన్నవారు ఇలా బేర్ ఫుట్ వాకింగ్ చేస్తే ఫ‌లితం ఉంటుంది. బేర్ ఫుట్ వాకింగ్‌నే గ్రౌండింగ్ లేదా ఎర్తింగ్ అని కూడా అంటారు. దీని వ‌ల్ల భూమికి మ‌న పాదాలు నేరుగా తాకుతాయి. గడ్డి, మ‌ట్టి లేదా ఇసుక‌లో వాకింగ్ చేయ‌వ‌చ్చు. దీని వ‌ల్ల నాడీ మండ‌ల వ్యవ‌స్థపై ప్రభావం ప‌డుతుంది. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ప్రభావం త‌గ్గుతుంది. అధ్యయ‌నాలు చెబుతున్న ప్రకారం ఇలా వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మంచి నిద్ర ప‌డుతుంది. నిద్రలేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. మెద‌డుకు ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంద‌ని అధ్యయ‌నాల్లో తేలింది. దీని వ‌ల్ల మెద‌డులో ఉండే నాడులు ఉత్తేజం చెందుతాయి. దీంతో మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. ఏకాగ్రత‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతాయి. మ‌తిమ‌రుపు త‌గ్గుతుంది. బేర్ ఫుట్ వాకింగ్ వ‌ల్ల శరీరంలో ఉండే వాపులు త‌గ్గిపోతాయి. భూమి నుంచి పాదాల ద్వారా ఎల‌క్ట్రాన్స్ మ‌న శ‌రీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి శ‌రీరంలో ఉండే వాపుల‌ను త‌గ్గిస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. రోగ నిరోధ‌క వ్యవ‌స్థను ప‌టిష్టం చేస్తాయి. బేర్ ఫుట్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం స‌హ‌జ‌సిద్ధంగా న‌డిచే భంగిమ‌కు అల‌వాటు ప‌డుతుంది. దీంతో పాదాల‌కు ఇన్ ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. పాదాల క‌ద‌లిక‌లు సైతం స‌రిగ్గా ఉంటాయి. పాదాల వాపుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అయితే బేర్ ఫుట్ వాకింగ్ మంచిదే అయిన‌ప్పటికీ ఇలా వాకింగ్ చేసేవారు జాగ్రత్తల‌ను పాటించాలి. న‌డిచే దారిలో ప‌దునైన వ‌స్తువులు లేకుండా చూసుకోవాలి. లేదంటే గాయాలు అవుతాయి. కొన్ని ప్రదేశాల్లో బ్యాక్టీరియా, వైర‌స్‌, ఫంగ‌స్ ఉండేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో బేర్ ఫుట్ వాకింగ్ చేయ‌కూడ‌దు. బేర్ ఫుట్ వాకింగ్ చేస్తే కొంద‌రు అసౌక‌ర్యానికి గుర‌వుతారు. అలాంటి వారు బేర్‌ఫుట్‌ వాకింగ్‌కి దూరంగా ఉండటం మంచిది. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకున్న తరువాతే బేర్ ఫుట్ వాకింగ్ చేయాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అసలు వీరు పేరంట్సేనా..? కన్న కొడుకును ఎయిర్‌పోర్ట్‌లో వదిలి వెకేషన్‌కు..?

అరుదైన ‘మాస్క్డ్‌ బూబీ’ని ఎప్పుడైనా చూసారా?

హీరోయిన్ కొత్త దందా… వీడియో కాల్‌కు 30వేలు, వాయిస్‌ కాల్‌కు 20 వేలు

Bigg Boss 9: బిగ్ బాస్‌ 9 కోసం నాగ్‌కు దిమ్మతిరిగే రెమ్యునరేషన్‌

Kantara: కాంతారను వెంటాడుతున్న మరణాలు