మా కష్టాలు మీకేం తెలుసు..అంటూ విసుక్కుంటున్న జాన్వీ కపూర్ వీడియో
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ స్టార్ కిడ్స్‌గా తాము ఎదుర్కొనే కష్టాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవుట్ సైడర్స్, ఇన్ సైడర్స్ సమస్యలను పోల్చి చూడడం తగదని ఆమె అభిప్రాయపడ్డారు. స్టార్ వారసులకు కూడా అనేక సమస్యలు ఉంటాయని, అయితే వాటి గురించి మాట్లాడటానికి ఎవరూ సిద్ధంగా ఉండరని జాన్వీ కపూర్ పేర్కొన్నారు.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ ఉత్తరాది, దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో బిజీగా ఉన్నారు. అయితే, ‘మా కష్టాలు మీకేం తెలుసు?’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్టార్ కిడ్‌గా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న జాన్వీ, స్టార్ వారసులకు కూడా కష్టాలుంటాయని స్పష్టం చేశారు. అవుట్ సైడర్స్ ఎదుర్కొనే కష్టాలను ఇన్ సైడర్స్ కష్టాలతో పోల్చడం సరికాదన్నారు. స్టార్ కిడ్స్‌కు చాలా సమస్యలుంటాయని, కానీ వాటి గురించి మాట్లాడితే ఎవరూ వినడానికి సిద్ధంగా ఉండరని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు, స్టార్ వారసులు కష్టపడ్డామని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
