సెగలు కక్కుతోన్న పాలమూరు రాజకీయం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పేలుతున్న మాటల తూటాలు..

|

May 24, 2024 | 7:05 PM

పాలమూరు రాజకీయం సెగలు కక్కుతోంది. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని చిన్నంబావిలో శ్రీధర్‌ రెడ్డి హత్య రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య అగ్గి రాజేసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వేధింపులు, హత్యలు పెరిగిపోయాయంటోంది బీఆర్ఎస్‌.

పాలమూరు రాజకీయం సెగలు కక్కుతోంది. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని చిన్నంబావిలో శ్రీధర్‌ రెడ్డి హత్య రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య అగ్గి రాజేసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వేధింపులు, హత్యలు పెరిగిపోయాయంటోంది బీఆర్ఎస్‌. నాలుగు నెలల వ్యవధిలో ఒకే నియోజకవర్గంలో రెండు హత్యలు జరిగాయంటోంది ప్రతిపక్షం. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై వేధింపులతో పాటు.. కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీమంత్రి కేటీఆర్‌. తెలంగాణలో ఎప్పుడూ లేని ఫ్యాక్షన్ సంస్కృతిని కొల్లాపూర్‌లో పరిచయం చేసిన మంత్రి జూపల్లిని వెంటనే బర్తరఫ్‌ చేయాలన్నారు కేటీఆర్‌. వరుస హత్యలపై సిట్‌ వేసి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తోంది బీఆర్ఎస్‌. జ్యూడిషయల్‌ విచారణకు ఆదేశించినా సిద్ధమంటున్నారు మంత్రి జూపల్లి. కేటీఆర్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వస్తే ప్రజల మధ్య హత్యలపై బహిరంగచర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు మంత్రి. హత్యల్లో తన పాత్ర ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా రెడీ అంటున్నారు జూపల్లి. ప్రజల పాలన పేరుకే.. రాష్ట్రమంతా ప్రతీకార పాలన తీసుకొచ్చారని బీఆర్ఎస్‌ అంటోంది. ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేక విమర్శలు చేస్తున్నారంటోంది కాంగ్రెస్. ఇంతకీ ఎవరిది నిజం? తెలంగాణలో ఫ్యాక్షన్ ఉందా? ప్రతీకారదాడులు నిజమేనా?