దాని ఫలితం ఎలా వస్తుందనే దానిపై ఫోకస్ చేయకూడదని అర్థం. అతిగా ఆలోచించేవారు తరచుగా తాము చేసే పనుల ఫలితాల గురించి ఎక్కువగా భయపడతారు. భగవద్గీత కర్మ చేయమని ఆ కర్మను నిస్వార్థంగా ఫలాపేక్ష లేకుండా చేయమని బోధిస్తుంది. ఫలితం గురించి చింతించకుండా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. వర్తమానంలో జీవించడం. దుఃఖములు కలిగినప్పుడు కలత చెందని మనసు కలవాడు. సుఖములు కలిగినప్పుడు కోరిక లేనివాడు. రాగము, భయము, క్రోధము లేనివాడు. స్థిరమైన బుద్ధి ఉన్న వాడిని ముని అంటారు. గీత వర్తమానంలో జీవించమని నొక్కి చెబుతుంది. గతంలో జరిగిన వాటి గురించి పశ్చాత్తాప పడడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వ్యర్థమని బోధిస్తుంది. ప్రస్తుత క్షణంలో మన దృష్టిని కేంద్రీకరించడం వల్ల అతిగా ఆలోచించడం తగ్గుతుంది. నువ్వు నీ ఆలోచనలు కాదు నువ్వు వాటికి సాక్షివి మాత్రమే అని చెబుతుంది భగవద్గీత. గీతలో శ్రీకృష్ణుడు మనసులో కలిగే ఆలోచనలు మన నిజస్వరూపం కాదని బోధిస్తాడు. ఆలోచనలు కేవలం మనసుకు చెందిన క్రియలు మాత్రమే. వాటిని గమనించేవాడివి నీవు. వాటితో నిన్ను నువ్వు గుర్తించుకోనప్పుడు అవి నీపై ప్రభావం చూపలేవు.