వర్షాకాలంలో ఈ పండ్లు తిన్నారో.. రోగాలకు రెడ్‌ కార్పెట్‌ పరిచినట్లే..

Updated on: Jul 23, 2025 | 3:22 PM

వర్షాకాలం ప్రారంభమైంది. ఈ సమయంలో పిల్లలు, వృద్ధులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఈ సీజన్‌లో వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంది. వాటిలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, వైరల్ జ్వరం వంటి సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నిజానికి వర్షాకాలంలో, తేమ, దుమ్ము, బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా పెరుగుతాయి. దాంతో ఇన్ఫెక్షన్స్‌ సోకుతాయి.

అందుకే ఈ సీజన్‌లో మనం తీసుకునే ఆహారం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి పండ్లు చాలా మేలు చేస్తాయి. కానీ వర్షాకాలంలో కొన్ని పండ్లను తినకూడదని నిపుణులు అంటున్నారు. ఈ పండ్లు తినడం ఆరోగ్యానికి మరింత హానికరమట. ముఖ్యంగా వర్షాకాలంలో నీరు అధికంగా ఉండే పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అవేంటో చూద్దాం. పుచ్చకాయలు వేసవిలో ఎక్కువగా లభిస్తాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో తేమతో కూడిన వాతావరణానికి ఇవి మంచివి కావు. ఇవి సులభంగా బ్యాక్టీరియాతో కలిసిపోయి కడుపు సంబంధిత సమస్యలను పెంచుతాయి. ఒకవేళ తింటే తాజాగా ఉన్నప్పుడు తక్కువ మొత్తంలో మాత్రమే తినండి. వాటిని కోసి ఫ్రిజ్‌లో పెట్టడం.. రోజంతా తినడం చేయకూడదు. ఇది ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఫలరాజైన మామిడి పండ్లు వేసవిలో విరివిగా దొరుకుతాయి. ఒక్కసారి ఇవి మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయంటే చాలామంది వేరేపండ్లవైపు కన్నెత్తికూడా చూరు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాడు నైట్ వాచ్‌మెన్‌గా జీతం రూ.165… నేడు.. కోట్లు సంపాదిస్తున్న నటుడు

బెంగుళూర్ గుహలో పిల్లలతో రష్యన్ మహిళ.. వివరాల్లోకి వెళ్లగా ఖంగుతిన్న పోలీసులు..