తొలి మహిళా లోకో పైలెట్ సురేఖ పదవీ విరమణ వీడియో

Updated on: Sep 22, 2025 | 1:48 PM

ఆసియాలో తొలి మహిళా లోకో పైలెట్‌గా 36 ఏళ్ల పాటు సేవలందించిన సురేఖ యాదవ్ పదవీ విరమణ చేశారు. ముంబై సెంట్రల్ రైల్వేలో గూడ్స్, ఎక్స్‌ప్రెస్, రాజధాని వంటి రైళ్లను నడిపిన ఆమె, మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆమె సాధన భారతీయ రైల్వేలో మహిళా సాధికారతకు నిదర్శనం.

సురేఖ యాదవ్, ఆసియాలో తొలి మహిళా లోకో పైలెట్‌గా 36 ఏళ్ల పాటు ముంబై సెంట్రల్ రైల్వేలో విధులు నిర్వహించిన తర్వాత పదవీ విరమణ చేశారు. మహారాష్ట్రలోని సతారాలో జన్మించిన ఆమె, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. 1989లో అసిస్టెంట్ లోకో పైలెట్‌గా తన కెరీర్ ప్రారంభించిన సురేఖ, గూడ్స్, మెయిల్, ఎక్స్‌ప్రెస్, రాజధాని, వందే భారత్ వంటి వివిధ రైళ్లను నడిపారు. పురుషులతో సమానంగా పోటీపడి, మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. 2024లో ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార వేడుకకు ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించడం గమనార్హం.

మరిన్ని వీడియోల కోసం :

కట్టలు కట్టలుగా పాములు..వామ్మో చూస్తేనే వణుకు పుడుతోంది డియో

దసరాకు శూర్పణఖ దహనం..ప్రియుడి కోసం పిల్లలు, భర్తలను చంపిన భార్యల ఫొటోలతో .. – TV9

మళ్లీ అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు వీడియోTV9

Published on: Sep 22, 2025 01:38 PM